ఐదు రోజుల్లో పెళ్లి జరగనుండగా కాబోయే వధువును షాపింగ్ కు తీసుకువెళ్లి ఆమెను హతమార్చాడో వరుడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ నగరంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెడితే...

ఐదు రోజుల్లో పెళ్లి జరగనుండగా కాబోయే వధువును షాపింగ్ కు తీసుకువెళ్లి ఆమెను హతమార్చాడో వరుడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ నగరంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెడితే...

టీనా అనే యువతికి తనకు కాబోయే భర్త, వరుడు జితిన్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. పెళ్లి వేడుక కోసం చీరలు కొనడానికి రమ్మని జితిన్ తనకు కాబోయే భార్య టీనాను కోరాడు. షాపింగ్ కోసం వచ్చిన టీనాను కాబోయే వరుడు జితిన్ హత్య చేశాడు.

మధ్యాహ్నం 2.30గంటల సమయంలో టీనా మృతదేహం గ్రామం వెలుపల రోడ్డు మీద పడి ఉంది. జితిన్ ను కలిసిన టీనా మరణించిందని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. టీనాను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే ఆమెను జితిన్ హత్య చేశాడని మృతురాలి కుటుంబసభ్యలు ఆరోపించారు. 

చీరలు కొనడనికి పిలిచి టీనాను జితిన్ గొంతుకోసి చంపాడని బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.