కన్నతండ్రే కీచకుడు.. స్లీపింగ్ పిల్స్ ఓవర్ డోస్‌తో హాస్పిటల్‌లో బాలిక.. తండ్రి హత్యాయత్నం
ముంబయిలో ఓ తండ్రి కొంత కాలంగా తన బిడ్డపైనే కామ వాంఛ తీర్చుకుంటున్నాడు. ఈ విషయాన్ని తల్లికి కూడా చెప్పింది. తండ్రి ప్రవర్తనతో తీవ్ర మానసిక క్షోభ అనుభవించిన మైనర్ బాలిక స్లీపింగ్ టాబ్లెట్స్ ఎక్కువగా వేసుకుంది. హాస్పిటల్‌లో చేరడంతో ఈ విషయాన్ని వెల్లడిస్తుందనే భయంతో తండ్రి ఆమెను హత్య చేసే ప్రయత్నం చేశాడు.

ముంబయి: బిడ్డ ఆలనా పాలనా చూడాల్సిన తండ్రే కీచకుడయ్యాడు. ఇంట్లోనే పాప నిద్రిస్తున్నప్పుడు అతనిలోని మనిషితనం మంటగలిసింది. తరుచూ బాలిక నిద్రిస్తున్నప్పుడు అఘాయిత్యానికి పాల్పడేవాడు. ఆ బిడ్డ భౌతికంగా, మానసికంగా చిత్రవధ అనుభవించింది. ఇవి భరించలేక స్లీపింగ్ పిల్స్ వేసుకుంది. ఓవర్ డోసుకు వైద్యులు హాస్పిటల్‌లో చికిత్స చేస్తుండగా ఆ కీచక తండ్రి కాలయముడిలా మారాడు. కన్న తండ్రినే పొట్టనబెట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే, సిబ్బంది సకాలంలో అప్రమత్తం కావడంతో కత్తి పట్టుకున్న తండ్రి నుంచి బాలికను కాపాడగలిగారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబయిలో జరిగింది.
44 ఏళ్ల నిందితుడు చికిత్స పొందుతున్న తన మైనర్ కూతురిని చంపడానికి ప్రయత్నించాడని సీనియర్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఆర్‌సీఎఫ్ పోలీసు స్టేషన్, చెంబూరు బాలాసాహెబ్ ఘవాతే ధ్రువీకరించారు. కానీ, వివరాలు చెప్పడానికి నిరాకరించారు. పోక్సో కేసు అని మాత్రమే తెలిపారు. అయితే, పోలీసు వర్గాల నుంచి కీలక సమాచారం అందింది.
Also Read: ఇన్సూరెన్స్ కట్టి భార్యను చంపేసిన భర్త.. రూ. 1.90 కోట్ల కోసం ప్రణాళిక వేసి యాక్సిడెంట్
ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో వార్డ్ అటెండెంట్‌గా పని చేసే 44 ఏళ్ల వ్యక్తి కొంత కాలంగా ఆ బాలికపై అత్యాచారం చేస్తున్నాడు. ఇటీవలే దీని గురించి ఆ బాలిక తన తల్లికి తెలియజేసింది. తాను నిద్రిస్తున్నప్పుడు తండ్రి అసభ్యకరంగా తనను తాకుతున్నాడని తల్లికి చెప్పినట్టు ఆ వర్గాలు తెలిపాయి. ఈ ప్రవర్తన కారణంగా ఆ మైనర్ బాలిక తీవ్రమైన మానసిక క్షోభ అనుభవించింది. డిప్రెషన్‌లోకీ వెళ్లింది. ఈ లైంగిక చర్యల కారణంగానే ఆమె స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంది. సోమవారం ఆమెను ఓ హాస్పిటల్‌లో చేర్చారు.
అయితే, తన కూతురి ఈ విషయాన్ని బయటకు చెబుతుందో ఏమో అని తండ్రి ఏకంగా కత్తినే పట్టుకుని హాస్పిటల్ వచ్చాడు. కూతురిని కత్తితో పొడిచి చంపాలని వెళ్లాడు. కానీ, హాస్పిటల్ సిబ్బంది అలర్ట్ అయి ఆ వ్యక్తిని దూరంగా తీసుకెళ్లారు. పోలీసులకు అప్పగించారు. అతనిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. హత్యాయత్నం అభియోగాలు కూడా నమోదు చేశారు.