Asianet News TeluguAsianet News Telugu

ఒంటెను ఢీ కొట్టి.. బెంగళూరు బైకర్ మృతి

ఫతేగఢ్ వద్ద బుధవారం రాత్రి శ్రీనివాసన్ బైక్ కు ఒంటె అడ్డువచ్చింది. దీ ంతో బైకు అదుపుతప్పి ఒంటెను ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాసన్ తలకు తీవ్రగాయాలై ప్రాణాలు కోల్పోయాడు.

Famous Bengaluru Biker Dies After Crashing Into Camel In Jaisalmer
Author
Hyderabad, First Published Jan 16, 2021, 7:59 AM IST

ఒంటెను ఢీకొని బెంగళూరుకు చెందిన ప్రముఖ బైకర్ మృతి చెందాడు. ఈ సంఘటన రాజస్థాన్ లోని జైసల్మేర్ జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారం ఈ ప్రమాదం జరగగా తాజాగా పోలీసులు వివరాలు వెల్లడించారు. కింగ్ రిచర్డ్ శ్రీనివాసన్ బెంగళూరులో బైకర్ గా గుర్తింపు పొందాడు. ఇటీవల అతడు మన ముగ్గురు స్నేహితులతో కలిసి బైక్ పై రాజస్థాన్ పర్యటనకు వెళ్లాడు.

ఈ క్రమంలో జైసల్మేర్ కు వెళ్తుండగా.. ఫతేగఢ్ వద్ద బుధవారం రాత్రి శ్రీనివాసన్ బైక్ కు ఒంటె అడ్డువచ్చింది. దీ ంతో బైకు అదుపుతప్పి ఒంటెను ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాసన్ తలకు తీవ్రగాయాలై ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు గురువారం మృతదేహానికి పోస్టుమార్టం చేసి.. అనంతరం అతని తల్లిదండ్రులకు అప్పగించారు.

శ్రీనివాసన్ గతంలో బైక్ పైనే బెంగళూరు నుంచి బయలుదేరి ఐదు ఖండాల్లో 37 దేశాల్లో పర్యటించాడు. మొత్తంగా 65వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. ఇటీవల అతను బీఎండబ్ల్యూ జీఎస్ బైక్ కొనుగోలు చేశాడు. త్వరలో ఆఫ్రికా వెళ్లాలని ప్లాన్ కూడా చేసుకున్నాడు. ఇంతలోనే ఇలా జరగడంతో.. అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios