ఆర్థిక సమస్యల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన ముంబయిలోని కాందీవలి ప్రాంతంలో చోటుచేసుకుంది. కాగా.. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరి ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై చుట్టుపక్కల వారిని విచారిస్తున్నారు. కాగా.. సంఘటనాస్థలంలో పోలీసులకు ఓ సూసైడ్ నోట్ లభిస్తుంది. వీరి ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు.

ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. కందీవాలీ వెస్ట్ ప్రాంతంలోని ఒక ఫ్లాట్‌లో వీరి కుటుంబం ఉంటోంది. మృతులలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ కేసులో పోలీసులు ఫారెన్సిక్ నిపుణుల సహాయం తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా డీసీపీ విశాల్ ఠాకుర్ మాట్లాడుతూ ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని, వారికి ఆ ఇంటి యజమాని అజగర్ అలీతో పాటు అతని ఇద్దరు పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయన్నారు. వీరి ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమని సూసైడ్ నోట్ ద్వారా తెలుస్తున్నదన్నారు