Asianet News TeluguAsianet News Telugu

UP polls 2022 : కాంగ్రెస్ కు స్టార్ క్యాంపెయినర్ గుడ్ బై.. లంచం ఇవ్వలేకపోయానంటూ ఆరోపణలు...

నా పేరు, నా పది లక్షల మంది సోషల్ మీడియా ఫాలోవర్లను కాంగ్రెస్ వాడుకుంది. కానీ రానున్న ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చేందుకు మాత్రం నిరాకరించింది. ఇది అన్యాయం. కావాలనే ఇలా చేశారు. నేను ఓబిసీ మహిళను కాబట్టే నాకు టికెట్ ఇవ్వలేదు అని ఆమె వాపోయారు. టికెట్ కోసం కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ, కార్యదర్శి సందీప్ సింగ్ లకు లంచం ఇవ్వలేకపోయాను అని కూడా ఆమె ఆరోపించారు.

 

Face of Congres ladki hoon, lad sakti hoon campaign likely to join BJP
Author
Hyderabad, First Published Jan 20, 2022, 8:30 AM IST

లక్నో : ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ Uttarpradesh రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ticket ఆశించి భంగపాటుకు గురైన కొందరు partyలు మారుతున్నారు. గత కొద్ది రోజులుగా బీజేపీ నుంచి సమాజ్ వాదీ పార్టీలోకి సాగిన వలసలు.. ఇప్పుడు రివర్స్ అయ్యాయి. యూపీ Women Congress Vice President సైతం ఇదే బాటలో పయనించనున్నట్లు తెలుస్తోంది. ‘లడ్ కీ హూ... లడ్ సక్ తీ హూ’ (నేను బాలికను.. అయినా పోరాడగలను..) అంటూ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో congress తరఫున ప్రచారం చేస్తూ.. ప్రజల చూపును తనవైపు తిప్పుకున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు Priyanka Maurya పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. టికెట్ దక్కక పోవడంతో తీవ్ర నిరాశకు గురైన ప్రియాంక కాంగ్రెస్ ను వీడి BJPలో చేరనున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ టికెట్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని ప్రియాంక మౌర్య బహిరంగంగానే ఆరోపించారు. నా పేరు, నా పది లక్షల మంది social media ఫాలోవర్లను కాంగ్రెస్ వాడుకుంది. కానీ రానున్న ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చేందుకు మాత్రం నిరాకరించింది. ఇది అన్యాయం. కావాలనే ఇలా చేశారు. నేను ఓబిసీ మహిళను కాబట్టే నాకు టికెట్ ఇవ్వలేదు అని ఆమె వాపోయారు. టికెట్ కోసం కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ, కార్యదర్శి సందీప్ సింగ్ లకు లంచం ఇవ్వలేకపోయాను అని కూడా ఆమె ఆరోపించారు.

యూపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. పార్టీల్లో అసమ్మతులు, చేరికలు ఊపందుకున్నాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల వేళ సీనియర్ నేత ములాయం సింగ్ యాదవ్ కి ఊహించని షాక్ తగిలింది. ఆయన సొంత కోడలు బీజేపీలో చేరడం గమనార్హం. ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్.. ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాథ్ సమక్షంలో బీజేపీలో చేరారు. కాగా గత కొంతకాలంగా.. ఈ మేరకు వార్తలు హల్ చల్ చేస్తుండగా.. బుధవారం అధికారంగా ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలు ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ములాయం సింగ్ రెండో భార్య సాధన యాదవ్ కొడుకు ప్రతీక్ భార్య.. అపర్ణయాదవ్. అపర్ణ తండ్రి అరవింద్ సింగ్ బిష్త్ జర్నలిస్ట్.. సమాజ్ వాదీ పార్టీ ప్రభుత్వ హయాంలో అపర్ణ తండ్రిని సమాచార కమిషనర్ గా నియమించారు. అపర్ణ లక్నోలోని లోరెటో కాన్వెంట్ ఇంటర్మీడియట్ కాలేజీలో పాఠశాల విద్యను అభ్యసించింది. అపర్ణ, ప్రతీక్ చదువుకునే రోజుల్లో కలుసుకుని, ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించారు.

ఇదిలా ఉండగా, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు Indian Kisan Union (బికెయు) ఏ Political partyకి తన మద్దతు ఇస్తుందనే వార్తలను నాయకుడు Rakesh Tikait ఖండించారు. పరేడ్ గ్రౌండ్‌లో రైతుల మూడు రోజుల 'Chintan Shivir'లో పాల్గొనడానికి మాగ్ మేళాకు వచ్చిన టికైత్ మంగళవారం మాట్లాడుతూ, "ఈ ఎన్నికల్లో మేము ఎవరికీ మద్దతు ఇవ్వం" అని తేల్చి చెప్పారు. దీంతో బికెయు మద్దతు ఏ పార్టీకి అని గత కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరపడినట్టైంది. 

Follow Us:
Download App:
  • android
  • ios