మార్చురీలో ఉంచిన మృతదేహం నుంచి కళ్లు మాయం చేశారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతా ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... కోల్ కత్తాకు చెందిన శుంభునాథ్ దాస్(69) గత ఆదివారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. కాగా... ఆయన మృతదేహాన్ని ‘ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్’ కి స్థానికులు తరలించారు.

కాగా... ఆస్పత్రికి తీసుకువచ్చేలోపే ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా.. ఆయన మృతదేహాన్ని  పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  అనంతరం మృతదేహాన్ని కుటుంబసబ్యులకు అప్పగించారు. అయితే... శంభునాథ్  శవానికి కళ్లు లేకుండా ఉండటాన్ని కుటుంబసభ్యులు గుర్తించారు.

వెంటనే ఈ విషయం గురించి హాస్పటల్ సిబ్బందిని ప్రశ్నించారు. అయితే... వారు దానికి నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం గమనార్హం. కళ్లను ఎలకలు తినేశాయంటూ సమాధానం చెప్పారు. ఆ సమాధానంతో అతని కుటుంబసభ్యులు నిర్ఘాంతపోయారు. దీనిపై విచారణ జరిపించాలని కోరుతూ శుంభునాథ్ కొడుకు సుశాంత ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టాడు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారులు దర్యాప్తు చేపట్టారు.