Asianet News TeluguAsianet News Telugu

Exclusive: రిపబ్లిక్ డే పరేడ్‌లోకి కేరళ శకటం రాకపోవడానికి 5 కారణాలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిపబ్లిక్ డే పరేడ్‌లో (Republic Day parade) పాల్గొనే వివిధ రాష్ట్రాల శకటాలకు సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయం దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల శకట నమూనాలను కేంద్రం తిరస్కరించడంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి కేరళ (kerala) రాష్ట్రం చేరింది. 

Exclusive 5 reasons why Kerala tableau did not enter Republic Day parade
Author
New Delhi, First Published Jan 20, 2022, 4:05 PM IST

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిపబ్లిక్ డే పరేడ్‌లో (Republic Day parade) పాల్గొనే వివిధ రాష్ట్రాల శకటాలకు సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయం దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల శకట నమూనాలను కేంద్రం తిరస్కరించడంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి కేరళ (kerala) రాష్ట్రం చేరింది. కేరళ శకటాన్ని కేంద్రం తిరస్కరించడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం భగ్గుమంది. కేంద్రంతో వున్న విభేదాల కారణంగా రాజకీయ ఎజెండాలో భాగంగానే కేరళ శకటాన్ని తిరస్కరించిందని వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇది సరికాదని.. రాష్ట్ర ప్రభుత్వం పంపిన నమూనాలో లోపాల కారణంగానే తిరస్కరణకు గురైందని అంటున్నారు. 

అయితే కలర్, నాణ్యత, దృశ్యమాన ప్రదర్శనలో స్పష్టత, డిజైన్ కాన్సెప్ట్ మొదలైన వాటి ఆధారంగా శకటం ఎంపిక జరుగుతుందని ఏషియానెట్ తెలుసుకుంది. ఎంపిక ప్రక్రియలో భాగంగా రెండవ దశ చివరి వరకు కేరళ రాష్ట్రం షార్ట్‌లిస్ట్‌లో వుందని.. అయితే తుది జాబితాలో మాత్రం చేరలేపోయిందని విశ్వసనీయ సమాచారం. రిపబ్లిక్ డే పరేడ్‌కు కేరళ శకటం స్థానం సంపాదించకపోవడానికి ఐదు రకాల కారణాలు ఒకసారి విశ్లేషిస్తే..

  1. కేరళ ఆమోదించిన [ఇమెయిల్ ప్రొటెక్టెడ్] థీమ్ డిజైన్, కాన్సెప్ట్‌తో కమ్యూనికేటివ్‌గా లేదని నిపుణుల ప్యానెల్ అభిప్రాయపడింది.
  2. ప్రారంభ డ్రాయింగ్‌లో, ట్రాక్టర్ మరియు ట్రైలర్ రెండింటిపై జటాయు వర్ణనతో మార్పులేని విధంగా ఉన్నాయని నిపుణుల ప్యానెల్ పేర్కొంది. జటాయు కళాకృతి యొక్క ప్రారంభ రూపకల్పన తరువాత నమూనా ప్రదర్శనలో మాత్రం అసమానంగా మారింది.
  3. రాజ్‌పథ్‌లో రంగుల స్కీమ్ (బూడిద రంగు) అంతగా కనిపించడం లేదని, నిస్తేజంగా ఉందని నిపుణుల కమిటీ భావించింది.
  4. అంతేకాకుండా, రాజ్‌పథ్‌లోని ప్రేక్షకులకు సంబంధించి.. ట్రైలర్ భాగంలో డిజైన్ స్ట్రక్చర్‌పై కప్ప చూపు స్పష్టంగా , విలక్షణంగా లేదని నిపుణుల ప్యానెల్ భావించింది. 
  5. ట్రాక్టర్ భాగం అంతగా ఆకట్టుకోలేదు. నారాయణ గురు, ఆదిశంకరుల నమూనాలను ట్రాక్టర్‌పై ప్రయత్నించారు. కానీ మొత్తం రూపకల్పన, ప్రదర్శన పట్టికలు కమ్యూనికేట్ చేయవలసిన సందేశాన్ని జనంలోకి చేరవేయడం లేదు.
     
Follow Us:
Download App:
  • android
  • ios