తాను ప్రేమించిన అమ్మాయి.. మరొకరికి భార్య అవడం చూసి తట్టుకోలేకపోయాడు. పెళ్లి పీటల మీదే  నవ వధువును తుపాకీతో కాల్చి చంపేశాడు. ఈదారుణ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంటుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... రాయ్ బరేలీలోని గాజియాపూర్ కి చెందిన బ్రిజేంద్ర.. అదే ప్రాంతానికిచెందిన ఆశ ప్రేమించుకున్నారు. అయితే.. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించలేదు. అంతేకాకుండా ఆశకు మరో అబ్బాయితో పెళ్లి నిశ్చయించారు.

దీంతో తల్లిదండ్రుల ఒత్తిడికి తలొగ్గిన ఆమె వేరే వ్యక్తితో పెళ్లికి అంగీకరించింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని బ్రిజేంద్ర ఆ వివాహ కార్యక్రమానికి తుపాకీతో వచ్చి ఆమెపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అదే తుపాకీతో అతనూ కాల్చుకున్నాడు.

పెళ్లిపీటల మీద ఉన్న యువతిపై అందరూ చూస్తుండగానే అతను ఈ దుశ్చర్యకు దిగడంతో అక్కడ ఉన్నవారంతా భయంతో పరుగులు తీశారు. ఆశ అక్కడికక్కడే మృతి చెందగా.. బ్రిజేంద్రను ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు.