ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే మాయ శంకర్‌ పతాక్‌ మీద లైంగిన ఆరోపణలు నమోదయ్యాయి. దీంతో ఆయన చిక్కులో పడ్డారు. తనపై ఎమ్మెల్యే లైంగిక దాడికి పాల్పడినట్లు ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. చేయడం కలకలం రేపుతోంది. 

చబీపూర్‌ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వారణాసి సమీపంలోని భగుటా గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని శంకర్‌ పతాక్‌కు చెందిన కాలేజీల్లో ఇంటర్ చదువుతోంది. ఈ క్రమంలోనే విద్యార్థినిని తన రూమ్‌లోకి పిలుపించుకున్న ఎమ్మెల్యే మొదట ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఆమెను లైంగికంగా వేధించాడు. 

ఈ విషయాన్ని విద్యార్థిని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారంతా కాలేజీకి చేరుకుని పతాక్‌కు నిలదీయగా క్షమాపణలు చెప్పి తప్పించుకున్నాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే ఈ ఘటన జరిగిన చాలా కాలం తరువాత ఆ యువతి ఓ వీడియోను విడుదల చేసింది.

తనపై పతాక్‌ లైంగిక దాడికి పాల్పడ్డాడని, శారీరకంగా చిత్రహింసలకు గురిచేశాడని వీడియోలో పేర్కొంది. అంతేకాకుండా వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

కాగా బీజేపీలో సీనియర్‌ నేతగా పేరొందిన 70 ఏళ్లు శంకర్‌1991లో ఓసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తరువాత విద్యాసంస్థలను స్థాపించి వాటికి చైర్మన్‌గా కొనసాగుతున్నారు. తాజాగా అతనిపై లైంగిక ఆరోపణలు రావడంతో బీజేపీ నేతలు స్పందించారు. 

చాలాకాలం నుంచి అతను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. మరోవైపు ఆ యువతి లీక్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో కేసు విచారణను పోలీసులు మరింత వేగవంతం చేశారు.