ప్రధాని మోడీ నాపై పోటీ చేసినా.. నేను గెలుస్తాను - కాంగ్రెస్ నేత శశిథరూర్ ధీమా..

ప్రధాని నరేంద్ర మోడీ (prime minister narendra modi) తనపై పోటీ చేసినా తప్పకుండా గెలుస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) అన్నారు. నాలుగో సారి తిరువనంతపురం (Thiruvananthapuram) నుంచి లోక్ సభ (Lok Sabha elections in 2024) కు పోటీ చేయబోతున్నానని ఆయన స్పషం చేశారు. 

Even if PM Modi contests against me.. I will win - Congress leader Shashi Tharoor..ISR

Shashi Tharoor : వచ్చే ఏడాది వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ అన్నారు. తాను నాలుగో సారి తిరువనంతపురం నుంచే ఎంపీగా పోటీ చేయబోతున్నాని స్పష్టం చేశారు. ఇక్కడ తన గెలుపు ఖాయమని చెప్పారు. ఒక వేళ ప్రధాన నరేంద్ర మోడీ తనపై పోటీ చేసినా.. ఎట్టి పరిస్థితుల్లోనూ తనదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.

Saveera Parkash : పాకిస్థాన్ ఎన్నికల బరిలో తొలి సారిగా హిందూ మహిళ.. ఆమె నేపథ్యం ఏంటంటే ?

తన భవిష్యత్ కార్యాచరణ పై ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ శశిథరూర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను తిరువనంతపురం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే తుది నిర్ణయం కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు. తనకు మళ్లీ అవకాశం ఇస్తే తప్పకుండా పోటీ చేస్తానని పేర్కొన్నారు. లోక్ సభకు తాను పోటీ చేయడం ఇదే చివరి సారి అని పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఈ తిరువనంతపురం నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలపై అడిగిన ప్రశ్నకు శశిథరూర్ సమాధానమిస్తూ.. మోడీ తనపై పోటీ చేసినా తాను గెలుస్తానని చెప్పారు. ప్రజలు అనుకుంటే తనను మార్చే హక్కు ఉందని అన్నారు. అయితే అది తాను ఎవరితో పోరాడుతున్నాననే దానిపై ఆధారపడి ఉండదని తెలిపారు.

కోవిడ్ కలవరం.. ఒక్క రోజే 628 కొత్త కేసులు నమోదు.. కర్ణాటకలో జేఎన్.1 విజృంభణ

‘‘నేను మొదట పోటీ చేసినప్పుడు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి కావాలనే కోరిక ఉండేది. కానీ అది జరగలేదు. ఇప్పుడు ప్రజలే దానిని నిర్ణయిస్తారు’’ అని చెప్పారు. కేరళ అసెంబ్లీకి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారా అనే ప్రశ్నకు శశిథరూర్ సమాధానమిస్తూ.. ప్రస్తుతానికి తన దృష్టంతా లోక్ సభ ఎన్నికలపైనే ఉందని అన్నారు. అప్పటి పరిస్థితులను బట్టి పరిశీలిస్తానని తెలిపారు.

‘ప్రజాపాలన’లో రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తం - మంత్రి శ్రీధర్ బాబు..

కాగా.. శశిథరూర్ ఐక్యరాజ్యసమితిలో అండర్ సెక్రటరీ జనరల్ గా పని చేసేవారు. తరువాత అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ ఉన్నత ఉద్యోగాన్ని వదిలేసి భారత్ కు వచ్చారు. తరువాత కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిశారు. 2009 లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆయనకు తిరువనంతపురం టికెట్ ఇవ్వడంతో గెలిచారు. అప్పటి నుంచి మరో రెండు సార్లు కూడా ఆయన ఎంపీగా గెలిచారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios