Asianet News TeluguAsianet News Telugu

గజ దొంగ ‘ఎస్కేప్ కార్తీక్’ 17వ సారి అరెస్టు.. కళ్లుగప్పి పారిపోవడంలో దిట్ట.. కనీసం 80 చోరీలు

16వ యేటా దొంగతనాలు ప్రారంభించిన కార్తీక్ క్షణాల్లో మాయమవుతాడు. చోరీ చేసి కంట పడకుండా పారిపోవడమే కాదు.. ఒక వేళ పట్టుబడ్డా.. పోలీసు కస్టడీ నుంచి కళ్లు గప్పి పారిపోవడంలో దిట్ట. అందుకే పోలీసులు ఆయనను ఎస్కేప్ కార్తీక్ అంటారు. కనీసం 80 దొంగతనాల కేసుల్లో ఆయనకు ప్రమేయం ఉన్నది. ఆయన అరెస్టుతో ఐదు కేసులను పోలీసులు క్రాక్ చేయగలిగారు. ఆయన దగ్గర నుంచి రూ. 1143 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
 

escape karthik arrested for 17th time in bengaluru
Author
Bengaluru, First Published Jan 1, 2022, 4:52 PM IST

బెంగళూరు: తన 16వ యేట నుంచి దొంగతనం (Robbery) ప్రారంభించాడు. బెంగళూరు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సహా పలు ప్రాంతాల్లో గుట్టుగా ఇళ్లల్లోకి దూరడం.. చోరీ చేయడం ఆయనకు వెన్నెతో పెట్టిన విద్య. ఎవరికీ తెలియకుండా సొమ్మును కాజేసే చోర కళ ఆయన సొంతం. అంతేనా.. పోలీసులు (Police) పట్టుకున్నా.. కళ్లుగప్పి పారిపోవడంలోనూ దిట్ట. నమ్మించి అనుమాత్రం అనుమానం రాకుండా జారుకోవడంలో ఆయనను మించి లేరు. అందుకే పోలీసులే ఆయన పేరును కార్తీక్ (Escape Karthik) నుంచి ఎస్కేప్ కార్తీక్‌గా మార్చారు. ఎట్టకేలకు ఆయనను తాజాగా 17వ సారి అరెస్టు చేశారు. ఈ సారి ఆయన వెంట యువ పోలీసులను, అదనపు సిబ్బందినీ పంపినట్టు అధికారులు తెలిపారు.

ఎస్కేప్ కార్తీక్ కనీసం 80 దొంగతనాలు చేసి ఉంటాడని పోలీసులు చెప్పారు. ఎస్కేప్ కార్తీక్ అరెస్టుతో ఐదు కేసులను ఛేదించగలిగారని అన్నారు. ఆయన దగ్గర నుంచి 11.43 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు సీజ్ చేశారు. 2005లో తొలిసారి తన 16వ యేటా ఓ ఇంటిలో బంగారు ఆభరణాలను దొంగతనం చేశాడు. అప్పటి నుంచి ఆయన దొంగతనాలకు అడ్డు లేకుండా పోయింది. దొంగతనం చేయడం.. అరెస్టు కావడం.. బెయిల్‌పై మళ్లీ విడుదలై.. చోరీలకు పాల్పడటం చేస్తుండేవాడు. బెయిల్‌పై విడుదల అవ్వడమే కాదు.. రెండు సార్లు పోలీసు కస్టడీ నుంచే తప్పించుకు పారిపోయాడు. అందుకే పోలీసులు ఆయనను ఎస్కేప్ కార్తీక్ అని పిలుస్తుంటారు.

Also Read: గాడిదల చోరీతో పోలీసులకు తంటా.. స్టేషన్ ఎదుట ధర్నా.. ‘ఇవి మా గాడిదలు కావు.. అవి పిలిస్తే వస్తాయి’

2008లో పరప్పాన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి ఆహారం సరఫరా చేసే వ్యాన్‌ ఎక్కి ఎవరికీ తెలియకుండా పరారయ్యాడు. అయితే, మరో 45 రోజుల తర్వాత పోలీసులు అతన్ని పట్టుకోగలిగారు. 2010లో క్రైం సీన్ రీక్రియేషన్ కోసం తీసుకెళ్లినప్పుడూ పోలీసు కస్టడీ నుంచి ఎస్కేప్ కార్తీక్ ఎస్కేప్ అయ్యాడు. ఆ తర్వాత పోలీసులు మరోసారి పట్టుకున్నారు.

Also Read: సినీ ఫక్కిలో దోపిడీ.. భార్యగా మెట్టినింటికీ.. అంతలోనే నగదు సర్దుకుని పరార్

ఎస్కేప్ కార్తీక్‌కు కొంత సానుకూల అంశం దొరికినా.. వాతావరణం ఏర్పడ్డ క్షణాల్లో మాయం అయ్యేవాడని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఆయన మైండ్, బాడీ అంత చురుకుగా ఉండేదని అన్నారు. పరుగెత్తడం, జంప్ చేయడం, ఎక్కవడం వంటి వాటిల్లోనూ ఆయనకు మంచి పట్టు ఉన్నది. అందుకే ఆయన సులువుగా దొంగతనాలు చేయడమే కాదు.. తృటిలో తప్పించుకునేవాడు కూడా అని వివరించారు. అయితే, మైసూరులో ఓ దొంగతనం చేసినప్పుడు పబ్లిక్ పట్టుకోగలిగారు. అప్పుడు ఎస్కేప్ కార్తీక్‌ను చితక బాదారు. రెండేళ్ల క్రితం ఈ ఘటన జరిగింది. ఆ ఘటనలో ఎస్కేప్ కార్తీక్ చేయి తీవ్రంగా గాయపడింది. ఆ తర్వాత ఆయన గర్ల్‌ఫ్రెండ్ సోదరుడూ దారుణంగా కొట్టాడు. కత్తితో కాలిలో పొడిచాడు. దీంతో ఆయన అంతకు ముందు పరుగెత్తిన తీరులో రన్నింగ్ చేయలేకపోతున్నాడు. కాబట్టి, ఆయన సామర్థ్యం కొంత తగ్గిందని ఆ పోలీసు అధికారి తెలిపారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా ఎస్కేప్ కార్తీక్‌ను కోర్టుకు లేదా... క్రైం సీన్ రీక్రియేషన్ కోసం తీసుకెళ్లినా.. ఆయన వెంట యువ, అదనపు సిబ్బందిని పంపిస్తున్నామని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios