ప్రముఖ సంస్థలపై, విఐపీలపై, రద్దీ ప్రాంతాలపై ఆత్మాహుతి దాడులకు పథకం వేసిన ముఠాను ఎన్ఐఎ అరెస్టు చేసింది. పది మందిని దేశ రాజధాని ఢిల్లీలో అరెస్టు చేశారు.

న్యూఢిల్లీ: పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐఎస్ ప్రోద్బలంతో భారతదేశంలో భారీ దాడులకు పన్నిన కుట్రను జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఎ) భగ్నం చేసింది. ప్రముఖ సంస్థలపై, విఐపీలపై, రద్దీ ప్రాంతాలపై ఆత్మాహుతి దాడులకు పథకం వేసిన ముఠాను ఎన్ఐఎ అరెస్టు చేసింది. 

పది మందిని దేశ రాజధాని ఢిల్లీలో అరెస్టు చేశారు. మరో ఆరుగురిని ఢిల్లీలోని, ఉత్తరప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో సోదాలు చేసి అరెస్టు చేశారు. ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా ఢిల్లీలో వారు ఆత్మాహుతి దాడులకు పథకం వేసినట్లు ఎన్ఐఎ గుర్తించింది. 

Scroll to load tweet…

ఈ ముఠాలో ఓ సివిల్ ఇంజనీర్, ఓ మౌల్వీ, ఓ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి, ఓ ఆటో డ్రైవర్ ఉన్నారు. మౌల్వీ గ్రూప్ నాయకుడిగా వ్యవహరిస్తున్నట్లు, అతని విదేశాల నుంచి ఆదేశాలు వస్తున్నట్లు అధికారులు చెప్పారు. 

తమ గ్రూప్ ను వాళ్లు హర్కత్ ఉల్ హర్బ్ ఏ ఇస్లామ్ గా పిలుచుకుంటున్నారు. బుధవారం ఉదయం నుంచి ఎన్ఐఏ సోదాలు సాగిస్తూ వచ్చింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ల్లోని 16 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. 

నాటు రాకెట్ లాంచర్లతో పాటు 12 పిస్టళ్లను, 112 అలారం క్లాక్ లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలారం క్లాక్ లను బాంబులు తయారు చేయడానికి వాడాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. 

Scroll to load tweet…