జమ్మూకాశ్మీర్ లో ఎన్‌కౌంటర్.. ఐఎస్ జేకే ఉగ్రవాది హతం
జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అతడికి ఏఎస్ఐ హత్య కేసులు సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
ANANTNAG ENCOUNTER : జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్ లో ఓ ఉగ్రవాది హతం అయ్యాడు. ఈ విశాయాన్ని భద్రతా బలగాలు ధృవీకరించాయి. ఇందులో మృతి చెందిన ఉగ్రవాదికి గతంలో ఓ పోలీసు హత్య కేసులో ప్రమేయం ఉందని తెలిపాయి. జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లోని శ్రీగుఫ్వారా ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగిందని ఇందులో నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ (ISJK)కి చెందిన ఒక ఉగ్రవాది హతమయ్యాడని కాశ్మీర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు తెలిపారు. ఇందులో మృతి చెందిన ఉగ్రవాది కడిపోరాకు చెందిన ఫహీమ్ భట్‌గా గుర్తించారు. అతడు ఇటీవలే ఉగ్రవాద సంస్థలో చేరాడని తెలిపారు. ఈ ఉగ్రవాది బిజ్‌బెహరా పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI) మహ్మద్ అష్రాఫ్ హత్య కేసులో ప్రమేయం ఉందని తెలుపుతూ కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు.
దేశంలో విజృంభిస్తోన్నOmicron .. ఎన్ని కేసులు నమోదయ్యాంటే..?
నిర్ధిష్ట సమాచారం ఆధారంగా..
ఉగ్రవాదుల ఉనికి పై నిర్ధిష్ట సమాచారం ఆధారంగా పోలీసులు, భద్రతా బలగాల సంయుక్త బృందం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. దీంతో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. డిసెంబరు 22వ తేదీన బిజ్‌బెహరా పోలీస్ స్టేషన్ బయట విధుల్లో ఉన్న ఏఎస్ఐ అష్రఫ్ ను ఉగ్రవాదులు హతమయ్యారు. కొన్నిగంటల ముందు పాత శ్రీనగర్ నగరంలోని మిర్జన్‌పోరా పరిసరాల్లో ఇంట్లో ఉన్న రౌఫ్ అహ్మద్ అనే పౌరుడిని ఉగ్రవాదులు చంపేశారు.