రాజకీయపార్టీలకు విరాళాలు ఇచ్చిన వారి సమాచారాన్ని నిర్ణీత గడవులోపుగా ఈసీకి అందించాలని  సుప్రీంకోర్టు ఎస్‌బీఐని ఆదేశించింది.

న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్ కు అందించేందుకు మరింత సమయం కావాలని ఎస్‌బీఐ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం నాడు తిరస్కరించింది. ఈ నెల 12వ తేదీ పనివేళల్లోపుగా ఈ వివరాలను అందించాలని ఎస్‌బీఐని ఆదేశించింది సుప్రీంకోర్టు. మరోవైపు ఈ నెల 15 సాయంత్రంలోపుగా ఈ సమాచారాన్ని వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని సుప్రీంకోర్టు ఈసీని ఆదేశించింది. గడువులోపుగా తమ ఆదేశాలను పాటించకుంటే కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని ఎస్‌బీఐ చైర్మెన్ , ఎండీ, డైరెక్టర్లను కోర్టు హెచ్చరించింది.

also read:చంద్రబాబు నివాసానికి బీజేపీ,జనసేన నేతలు: సీట్ల సర్ధుబాటుపై కీలక చర్చలు

ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్దమని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ ఏడాది ఫిబ్రవరి 15న తీర్పును వెల్లడించింది.రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన వారి వారి వివరాలు, విరాళాలు తీసుకున్నవారి సమాచారాన్ని ఈ నెల 13 లోపుగా వెల్లడించాలని ఎస్‌బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎలక్టోరల్ బాండ్ వివరాలను వెల్లడించేందుకు ఈ ఏడాది జూన్ వరకు గడువును పెంచాలని ఎస్ బీ ఐ గత వారం ఉన్నత న్యాయస్థానాన్ని కోరింది. 

also read:నిడదవోలు నుండి జనసేన పోటీ: కందుల దుర్గేష్‌ను ప్రకటించిన పవన్ కళ్యాణ్

సీజేఐ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, బీ.ఆర్. గవాయ్, జే.బీ. పార్ధివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఇవాళ కీలక తీర్పును వెల్లడించింది.గత 26 రోజులుగా మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారని కోర్టు ప్రశ్నించింది. ఈ విషయమై ఎందుకు మౌనంగా ఉన్నారని కూడ సుప్రీంకోర్టు ప్రశ్నించింది.వేర్వేరు బ్యాంకు శాఖల్లోని సమాచారాన్ని సేకరించి సరిపోల్చుకొనేందుకు సమయం ఇవ్వాలని ఎస్‌బీఐ తరపు న్యాయవాది హరీష్ సాల్వే కోరారు.