ఆరు రాష్ట్రాల్లోని 13 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 31న ఎన్నికలు జరగనున్నాయి.ఈ మేరకు ఇవాళ ఈసీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. 

న్యూఢిల్లీ: ఆరు రాష్ట్రాల్లోని 13 Rajya Sabha స్థానాలకు ఈ నెల 31న Polling జరగనున్నాయి. ఈ మేరకు సోమవారం నాడు Election Commission ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది.

అసోంలో రెండు, హిమాచల్‌ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్ లో ఒక్కటి చొప్పున, కేరళలో మూడు, పంజాబ్ లో ఐదు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు జరిగే స్థానాల్లో ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న వారంతా వచ్చే మాసంలో రిటైర్ కానున్నారు. దీంతో ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 14న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 31న ఎన్నికలను నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు నుండే నామినేషన్లను స్వీకరించనున్నారు. 

రాజ్యసభ నుండి రిటైర్ అవుతున్న వారిలో కేరళ నుండి ఆంటోని, హిమాచల్ ప్రదేశ్ నుండి శర్మ, ప్రతాప్ సింగ్, బజ్వా, నరేష్ గుజ్రాల్ లు ఉన్నారు..పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే ఫలితాల ఆధారంగా రాజ్యసభ ఎన్నికల్లో ఆయా పార్టీల గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయి.