త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో ప్రకటించనుంది. 

త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో ప్రకటించనుంది. ‘‘ఈ వారం చివర్లో...లేదంటే మంగళవారంలోగా ప్రకటన వెలువడుతుంది’’ అని ఈసీ వర్గాలు తెలిపాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ప్రాథమిక ఏర్పాట్లు కొలిక్కిరావడంతో ఎన్నికల తేదీల ప్రకటనకు రంగం సిద్ధమైందని పేర్కొన్నాయి. ఏప్రిల్‌- మే నెలల మధ్య 7-8 దశల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మార్చి నెలాఖరులో తొలి దశ ప్రకటన వెలువడనుండగా, ఇందుకు సంబంధించిన ఎన్నికలు ఏప్రిల్‌లో జరగనున్నాయి. 

సంప్రదాయాన్ని అనుసరించి లోక్‌సభ ఎన్నికలతో పాటు పదవీకాలం పూర్తి కానున్న ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీల ఎన్నికలను కూడా ఈసీ నిర్వహించనుంది.