2014 ఎన్నికల్లో ఈవీఎంలను హ్యాక్ చేశారని ఓ సైబర్ నిపుణుడు సయ్యద్ సుజా ఆరోపించారు. సోమవారం నాడు ఆయన లండన్‌లో మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు
న్యూఢిల్లీ: 2014 ఎన్నికల్లో ఈవీఎంలను హ్యాక్ చేశారని ఓ సైబర్ నిపుణుడు సయ్యద్ సుజా ఆరోపించారు. సోమవారం నాడు ఆయన లండన్‌లో మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు.అయితే ఈ ఆరోపణలను ఈసీ కొట్టిపారేసింది. ఈ ఆరోపణలను చేసిన సుజాపై చట్టపరమైన చర్యలు తీసుకోనేందుకు ఈసీ యోచిస్తోంది.
ఈవీఎంలను ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చో ఆయన మీడియాకు వివరించారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేత కపిల్ సిబల్ కూడ ఉన్నారు. కపిల్ సబిల్ సమక్షంలో ఈవీఎంలను ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చో ఆయన చూపించారు. ఈ సమావేశాన్ని లైవ్ ద్వారా చూపించారు.
ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. సుజాపై చర్యలకు ఈసీ రంగం సిద్దం చేస్తోంది. మరో వైపు కాంగ్రెస్ పార్టీ కొత్త నాటాకానికి తెరతీసిందని బీజేపీ విమర్శించింది.
కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ కాంగ్రెస్ ఈవీఎంల హ్యాకింగ్ చేసినట్టు సైబర్ నిపుణుడు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. సుజా చేసిన ఆరోపణలపై బీజేపీయేతర పార్టీల నేతలు, సీఎంలు స్పందించారు.
