Asianet News TeluguAsianet News Telugu

అమానుషం : 18 నెలల చిన్నారిని కరిచి చంపిన వీధి కుక్కలు.. !

మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. వీధి కుక్కల దాడిలో 18నెలల చిన్నారి అర్థాంతరంగా కన్నుమూసింది. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై వీధికుక్కలు కర్కశంగా దాడికి తెగబడ్డాయి.. దీంతో తీవ్రగాయాలపాలైన బాలిక అక్కడికక్కడే చనిపోయింది. 

eighteen months old baby dies after being bitten by stray dogs in madhyapradesh - bsb
Author
Hyderabad, First Published Feb 16, 2021, 10:39 AM IST

మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. వీధి కుక్కల దాడిలో 18నెలల చిన్నారి అర్థాంతరంగా కన్నుమూసింది. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై వీధికుక్కలు కర్కశంగా దాడికి తెగబడ్డాయి.. దీంతో తీవ్రగాయాలపాలైన బాలిక అక్కడికక్కడే చనిపోయింది. 

ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్ లోని కథోండాలో జరిగింది. దీపాలి అనే 18 నెలల పాప కథోండాలోని తమ ఇంటిముందు ఆడుకుంటోంది. ఇంతలో ఎక్కడినుండో పరిగెత్తుకు వచ్చిన వీధికుక్కలు బాలిక మీద ఎగబడ్డాయి. 

ఎక్కడ పడితే అక్కడ వాడిపళ్లతో కొరికేశాయి. పాప పొట్ట మీద కూడా కొరికాయి. పాప ఏడుపులు, అరుపులు విని వెంటనే అక్కడి పరిగెత్తుకొచ్చిన తల్లి కుక్కల్ని తరిమేసింది. అప్పటికే తీవ్రగాయాల పాలైన దీపాలిని స్థానిక ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూనే చిన్నారి మరణించింది. 

మధోటల్ పోలీస్ స్టేషన్ ఇన్ ఛార్జ్ రీనాపాండే ఈమేరకు తెలిపారు. కుక్కల దాడిలో మరణించిన దీపాలి మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం చేశారు. కుక్కల దాడి వల్లే చిన్నారి చనిపోయిందని వైద్యులు నిర్థారించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios