Asianet News TeluguAsianet News Telugu

బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల: మూడు విడతల్లో ఎన్నికలు

 బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నాడు విడుదల చేసింది.

EC announces Bihar Assembly Election schedule
Author
New Delhi, First Published Sep 25, 2020, 12:38 PM IST

న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నాడు విడుదల చేసింది.బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సునీల్ అరోరా విడుదల చేశారు.బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ర్యాలీలు, సభలకు  కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదు.  కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుు తీసుకొంటామని ఈసీ హెచ్చరించింది.

బీహార్ రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.  నవంబర్ 29వ  తేదీతో బీహార్ అసెంబ్లీకి గడువు ముగియనుంది.ఈ లోపుగా ఎన్నికలు నిర్వహించనున్నారు. 

మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సునీల్ ఆరోరా ప్రకటించారు. భౌతిక దూరం పాటించేందుకు వీలుగా ప్రతి పోలింగ్ స్టేషన్ లో వెయ్యి మందికి మించకుండా ఏర్పాట్లు చేశారు. ఆన్ లైన్ , ఆఫ్ లైన్ లో కూడ నామినేషన్లను కూడ స్వీకరించే వెసులుబాటును కల్పించింది ఈసీ.

అభ్యర్థితో పాటు ఐదుగురికి మించకుండా ప్రచారానికి అనుమతి ఇవ్వరు. నామినేషన్ దాఖలు చేయడానికి రెండువాహనాలను మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్టుగా  ఈసీ తేల్చి చెప్పింది.2015లో రాష్ట్రంలో 65, 337 పోలింగ్ కేంద్రాలు ఉంటే..ఈ దఫా లక్షకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టుగా ఈసీ తెలిపింది.

కరోనాను పురస్కరించుకొని ఏడు లక్షల హ్యాండ్ శానిటైజర్స్, 46 లక్షల మాస్కులు, 6 లక్షల పీపీఈ కిట్స్, 6.7 లక్షల ఫేస్ షీల్డ్స్, 23 లక్షల హ్యాండ్ గ్లౌజ్ లను అందుబాటులో ఉంచుతున్నట్టుగా ఈసీ ప్రకటించింది.

కరోనా సోకిన వ్యక్తులు పోలింగ్ చివరి గంటలో ఓటు హక్కును నమోదు చేసుకోవచ్చు. లేదా పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకొనే అవకాశాన్ని ఈసీ కల్పించింది.అభ్యర్థుల నేరచరిత్రను రాజకీయ పార్టీలు ఈసీకి సమర్పించాలని ఈసీ ఆదేశించింది. బీహార్, కర్ణాటక, నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానాలకు ఇవాళ సాయంత్రం షెడ్యూల్ ను విడుదల చేయనున్నట్టుగా ఈసీ ప్రకటించింది.

మొదటి విడతలో 71 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు.రెండో విడత 94 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు.
మూడో విడతలో 78 అసెంబ్లీ స్తానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టుగా ఈసీ తెలిపింది

.మొదటి విడత ఎన్నికల కోసం  అక్టోబర్ 1 న నోటిఫికేషన్ విడుదల  చేయనున్నారు. నామినేషన్ స్వీకరణను అదే రోజు నుండి చేస్తారు. అక్టోబర్ 8వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అక్టోబర్ 9న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు.అక్టోబర్ 28వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు.

అక్టోబర్ 09న రెండో విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. రెండో విడత ఎన్నికలను నవంబర్ 3వ తేదీ న నిర్వహిస్తారు. మూడో విడత ఎన్నికలను నవంబర్ 7వ తేదీన నిర్వహించనున్నారు.బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలను నవంబర్ 10వ తేదీన విడుదల చేయనున్నట్టుగా ఈసీ ప్రకటించింది.

 


 మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్

నోటిఫికేషన్ అక్టోబర్ 1వ తేదీ
నామినేషన్ల దాఖలుకు  చివరి తేదీ అక్టోబర్ 08
నామినేషన్ల స్క్యూట్నీ అక్టోబర్ 09
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13
పోలింగ్ తేది అక్టోబర్ 28
ఓట్ల లెక్కింపు నవంబర్ 10

రెండో విడత ఎన్నికలు
ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 09
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 16
నామినేషన్ల స్క్యూట్నీ  అక్టోబర్ 17
నామినేషన్ల ఉపసంహారణకు చివరి తేదీ అక్టోబర్ 19 

పోలింగ్  నవంబర్ 03
ఓట్ల లెక్కింపు నవంబర్ 10

మూడో విడత ఎన్నికలు

నోటిఫికేషన్ అక్టోబర్ 13

నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 20
 నామినేషన్ల  స్క్యూట్నీ అక్టోబర్ 21
నామినేషన్ల ఉపసంహారణకు చివరి తేదీ అక్టోబర్ 23

పోలింగ్  తేదీ. నవంబర్ 07

ఓట్ల లెక్కింపు నవంబర్ 10

నామినేషన్ల స్వీకరణ

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios