Asianet News TeluguAsianet News Telugu

5 states assembly election schedule : యూపీ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఇదే

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు (5 state Assembly Election 2022) కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) షెడ్యూల్ విడుదల  చేసింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను సీఈసీ సుశీల్ చంద్ర ప్రకటించారు. 

EC announced dates for Assembly polls in Uttar Pradesh Punjab Goa Manipur and Uttarakhand
Author
New Delhi, First Published Jan 8, 2022, 4:21 PM IST

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు (5 state Assembly Election 2022) కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) షెడ్యూల్ విడుదల  చేసింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను సీఈసీ సుశీల్ చంద్ర ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో..  ఉత్తరప్రదేశ్ శాసనసభ గడువు మే నెలతో, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసనసభల గడువు మార్చి నెలలో వివిధ తేదీల్లో ముగియనున్నాయి. యూపీలో 403, ఉత్తరాఖండ్‌లో 70, పంజాబ్‌లో 117, గోవాలో 40, మణిపూర్‌లో 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఐదు రాష్ట్రాల్లో పాజిటివిటీ రేట్ పరిశీలించామని సుశీల్ చంద్ర తెలిపారు. కోవిడ్ వల్ల పోలింగ్ సమయాన్ని గంట పెంచుతున్నామి ఆయన చెప్పారు. ప్రచారంలో రోడ్ షోలు రద్దు చేస్తున్నట్లు సీఈసీ తెలిపారు. వీటితో పాటు పాదయాత్రలు, బైక్ ర్యాలీలను కూడా రద్దు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అభ్యర్థుల విజయోత్సవాలు కూడా రద్దు చేస్తున్నట్లు సుశీల్ చంద్ర ప్రకటించారు. రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు ప్రచారంపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. గెలిచిన అభ్యర్ధి వెంట ఇద్దరికే అనుమతి వుంటుందని.. తక్షణమే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని సీఈసీ వెల్లడించింది. ఈ నెల 15 వరకు రోడ్ షోలకు అనుమతి లేదని ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే ఈ నెల 15 వరకు పాదయాత్రలకు అనుమతి లేదని సీఈసీ వెల్లడించారు. ఎన్నికల సిబ్బందికి కోవిడ్ బూస్టర్ డోస్ వేస్తామని చెప్పారు.

మొత్తం 7 దశల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయని సీఈసీ వెల్లడించింది. జనవరి 14న యూపీలో తొలి దశ పోలింగ్ జరుగుతుందని ఆయన ప్రకటించారు. తొలి దశ పోలింగ్ ఫిబ్రవరి 10న జరుగుతుందని పేర్కొన్నారు. రెండో దశ పోలింగ్ ఫిబ్రవరి 14న, ఫిబ్రవరి 23న మూడో విడత పోలింగ్ జరుగుతుందని సీఈసీ చెప్పారు. 

7 విడతల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు

జనవరి 14న యూపీ ఎన్నికల నోటిఫికేషన్‌

7 విడతల్లో యూపీ  ఎన్నికలు:

  • తొలి దశ పోలింగ్‌ తేదీ ఫిబ్రవరి - 10
  • రెండో దశ పోలింగ్‌ ఫిబ్రవరి -14
  • మూడో విడత పోలింగ్‌ ఫిబ్రవరి -20
  • నాలుగో విడత పోలింగ్‌ ఫిబ్రవరి -23
  • ఐదో విడత పోలింగ్‌ ఫిబ్రవరి -27
  • మార్చి 3న ఆరో విడత ఎన్నికలు
  • మార్చి 7న ఏడో విడత ఎన్నికలు


ఏక విడతలో ఫిబ్రవరి 14న పంజాబ్‌, గోవా, ఉత్తరాఖండ్‌ ఎన్నికలు

మణిపూర్‌లో రెండు విడతల్లో ఎన్నికలు:

  • ఫిబ్రవరి 27న మణిపూర్‌ తొలివిడత ఎన్నికలు
  • మార్చి 3న మణిపూర్‌ రెండో విడత ఎన్నికలు

మార్చి 10న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు

Follow Us:
Download App:
  • android
  • ios