సంజనగూడు చేరుకోగానే ముందుగా నదిలో స్నానానికి వెళ్తామని నమ్మించాడు. భర్త చెప్పిన ప్రతీదానికి భార్య సంతోషంగా ఒప్పుకుంటోంది. మద్యం మానేస్తే తమ జీవితాల్లో కొత్త వెలుగు వస్తుందని చాలా ఉత్సాహంగా ఉందామె. అయితే నది వద్దకు చేరుకోగానే భర్త అనుకోని విధంగా షాక్ ఇచ్చాడు. ముందుగా ఆమెను గట్టిగా నదిలోకి తోసేసాడు. అనుకోని ఈ పరిణామానికి ఆమె నిలదొక్కుకునేలోపే నదిలో పడిపోయింది. 

మైసూరు : అతడు liquorకి బానిస. ఉదయం లేచినప్పటి నుంచి మత్తులోనే ఉంటాడు. పిల్లలతో కలిసి templeకి వెళ్దామని అతడు చెప్పినప్పుడు బహుశా మద్యానికి స్వస్తి చెబుతాడని.. భగవంతుని ముందు ప్రమాణం చేసేందుకే తీసుకెళ్తున్నాడని భావించింది ఆ అమాయక ఇల్లాలు. దీంతో సంతోషంగా తన పిల్లలిద్దర్ని తీసుకుని Sanjanaguduకు పయనం అయింది. 

సంజనగూడు చేరుకోగానే ముందుగా నదిలో స్నానానికి వెళ్తామని నమ్మించాడు. భర్త చెప్పిన ప్రతీదానికి భార్య సంతోషంగా ఒప్పుకుంటోంది. మద్యం మానేస్తే తమ జీవితాల్లో కొత్త వెలుగు వస్తుందని చాలా ఉత్సాహంగా ఉందామె. అయితే నది వద్దకు చేరుకోగానే భర్త అనుకోని విధంగా షాక్ ఇచ్చాడు. ముందుగా ఆమెను గట్టిగా నదిలోకి తోసేసాడు. అనుకోని ఈ పరిణామానికి ఆమె నిలదొక్కుకునేలోపే నదిలో పడిపోయింది. 

ఆ సమయంలో Riverలో Water flow అధికంగా ఉండడంతో.. ఆమె వెంటనే నదిలో కొట్టుకుపోవడం.. ప్రాణాలు కోల్పోవడం క్షణాల్లో జరిగిపోయింది. భార్య చనిపోయిందని నిర్థారించుకున్న తరువాత పిల్లలిద్దరినీ నీటిలోకి తోసేశాడు. అయితే children అదృష్టమో, దురదృష్టమో.. ఆ సమయానికి అది అక్కడికి వచ్చిన fishermen కంట పడింది. వెంటనే జాలర్లు హుటాహుటిన నీటిలోకి దూకి పిల్లలిద్దర్ని రక్షించారు. పసివాళ్లని కూడా చూడకుండా నీటిలోకి తోసిన ఆ కసాయి తండ్రిని బంధించి పోలీసులకు అప్పగించారు. 

పాము కాటుతో భార్యను చంపిన భర్త: సూరజ్‌కి డబుల్ జీవిత ఖైదు

అయితే, అంతకు ముందే wifeను కూడా అలాగే తోసేశాడని తెలిసి షాక్ అయ్యారు. ఈ ఘటన కపిలా నది తీరంలో చోటు చేసుకుందని బుధవారం ఇక్కడ పోలీసులు తెలిపారు. మృతి చెందిన మహిళను దేవి గా గుర్తించారు. నంజనగూడు తాలూకా కసువినహళ్లికి చెందిన దేవికి ముద్దహళ్లికి చెందిన రాజేష్ తో కొన్నేళ్ళ కిందటే వివాహమయ్యింది.

రాజేష్ ఎప్పుడూ మద్యం మత్తులోనే ఉండేవాడు. అది ఏ సమయం అయినా కానీ తూగుతూనే ఉండేవాడు. అలాంటి భర్త చివరకు తన ప్రాణాల్ని తీస్తాడని కనీసం ఆమె ఊహించను కూడా ఊహించలేదు. తల్లి హత్యకు గురికావడం, తండ్రి ఠాణా పాలవడంతో పిల్లలిద్దరూ అనాథలుగా మారారు. ప్రస్తుతం తమ బంధువుల నివాసంలో ఆశ్రయం పొందుతున్నారు. 

ఇదిలా ఉండగా, చికెన్ ఫ్రై చేయలేదని ఓ వ్యక్తి ఆవేశంలో భార్యను చంపేశాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో ఆగస్టులో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరులో ముబారక్ పాషా(30), షిరిన్ బాను అనే దంపతులు నివాసం ఉంటున్నారు. కొన్ని రోజులుగా తమ కుమార్తె కనిపించకుండా పోయిందంటూ షిరిన్ తల్లిదండ్రులను పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు షిరిన్ భర్త ముబారక్ పాషాను విచారించగా.. ఆమె హత్య విషయం వెలుగులోకి వచ్చింది.

తానే స్వయంగా తన భార్యను చంపేశానంటూ అంగీకరించాడు. తాను ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే సరికి చికెన్ ఫ్రై వండి ఉంచమని చెప్పానని.. అయితే.. తన భార్య వండలేదని ఆయన పేర్కొన్నాడు. ఎందుకు వండలేదని ప్రశ్నిస్తే.. ఎదురు సమాధానం చెప్పిందని.. అందుకే ఆవేశంతో కర్రతో తలపై కొట్టి చంపేశానని అతను చెప్పాడు. ఆ సమయంలో పిల్లలు నిద్రపోతున్నారని.. శవాన్ని గోనె సంచిలో పెట్టి.. అర్థరాత్రి బైక్ మీద పెట్టుకొని సరస్సులో పడేసి వచ్చినట్లు చెప్పాడు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.