మద్యం మత్తులో భార్యమీద గొడ్డలి ఎత్తాడో భర్త.. ఆమె భయంతో పారిపోగా.. కళ్లముందు కనిపించిన చిన్నారులను అతికిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటస ఒడిశా రాష్ట్రంలో జరిగింది.
ఒడిశా : తాగి వచ్చిన మైకంలో భార్యతో గొడవ పడ్డ వ్యక్తి.. ఆమె మీద కోపంతో గొడ్డలి ఎత్తాడు. ఆమె ప్రాణభయంతో పారిపోవడంతో ఆవేశంతో ఊగిపోయాడు. liquor మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో కళ్ళముందు ముగ్గురు చిన్నారులు కనిపించారు. ఆవేశంతో ఊగిపోతున్న తండ్రిని చూసి బిక్కుబిక్కు మనడం తప్ప మరేమీ తెలియని 5 ఏళ్ల కుమార్తె, తండ్రిని గుర్తు పట్టడం తప్ప పరిస్థితి అర్థం చేసుకోలేని రెండేళ్ల కుమారుడు.. తల్లి దగ్గర లేకపోవడంతో పాల కోసం ఏడుస్తున్న ఆరు నెలల చిన్నారి.
ఆ స్థితిలో ఆ పసి వాళ్ళని చూసైనా ఆ కర్కశుడి మనసు కరగలేదు. కానీ, మద్యం మత్తులో తాను ఏం చేస్తున్నాడో మర్చిపోయి… తన సొంత పిల్లలని కూడా చూడకుండా గొడ్డలికి పని చెప్పాడు. ముగ్గుర్ని తెగనరికి… ఆ తర్వాత ఓ బావిలో పడేశాడు. ఈ దారుణం odishaలో చోటు చేసుకుంది. సుందర్ గఢ్ జిల్లా కొయిడా జిల్లా కులా గ్రామానికి చెందిన పండు ముండా శనివారం సాయంత్రం మద్యం తాగి ఇంటికి వచ్చాడు. భార్యతో గొడవపడి గొడ్డలితో ఆమెను వెంబడించాడు. ప్రాణ భయంతో ఆమె దాక్కోవడంతో ఇంటికి వచ్చి అభం, శుభం తెలియని తన ముగ్గురు పిల్లల్ని సీమ(5), రాజు (2), ఆరు నెలల చిన్నారిని గొడ్డలితో నరికి చంపాడు.
ఆ తర్వాత deadbodyలను బావిలో పడేసి స్థానికంగా ఉండే అడవిలోకి పారిపోయాడు. ఆదివారం ఉదయం తల్లి ఇంటికి వచ్చి చూసేసరికి వారు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికింది. చివరికి మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కొన్ని గంటల వ్యవధిలో ఈ దారుణానికి పాల్పడిన పండు ముండాను అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉండగా, భార్యతో divorce కోసం కోర్టుకు వచ్చిన ఓ భర్త అందరూ చూస్తుండగానే ఆమెపై knifeతో విచక్షణారహితంగా దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. tamilnaduలోని పెరంబదూర్ జిల్లా కోర్టు వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుధా, కామరాజు అనే దంపతులు విడిపోయి గత కొన్నేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. విడాకుల కోసం courtను ఆశ్రయించగా.. ఆ కేసు విచారణ కొనసాగుతోంది. అయితే, శుక్రవారం ఈ కేసు విచారణ కోసం వారిద్దరూ అనుకోకుండా ఒకే బస్సులో ప్రయాణం చేసి వచ్చారు.
కోర్టు బస్ స్టాప్ వద్ద దిగగానే... దాచి పెట్టుకొని వచ్చిన కత్తితో కామ్ రాజ్.. తన భార్యపై దాడి చేశాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని హత్యాయత్నం నేరం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ మణి వెల్లడించారు. అదే బస్సు నుంచి దిగిన ఓ పోలీసు, కోర్టు బయట విధులు నిర్వర్తించే వ్యక్తి అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఒకరికి తీవ్ర గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. మహిళకు చికిత్స కొనసాగుతుందన్నారు. ఈ జంట గత కొన్నేళ్లుగా విడాకుల కోసం పోరాడుతుండగా.. ప్రస్తుతం ఈ కేసు ఆఖరి దశలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
