Asianet News TeluguAsianet News Telugu

శృంగేరీ శారదాపీఠం ఆస్థాన జ్యోతిర్విద్వాంసుడిగా తెలుగు పండితుడు..

సుప్రసిద్ధ జ్యోతిష పండితులు పరిశోధకులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రికి అరుదైన గౌరవం దక్కింది. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జగద్గురు ఆది శంకరాచార్యుల వారు స్థాపించిన దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం ఆస్థాన జ్యోతిర్విద్వాంసులుగా ఆయన నియమితులయ్యారు. 

Dr. Shankaramanchi Ramakrishnashastri as the Astronomer of Sringeri Saradapith - bsb
Author
Hyderabad, First Published Oct 27, 2020, 1:02 PM IST

సుప్రసిద్ధ జ్యోతిష పండితులు పరిశోధకులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రికి అరుదైన గౌరవం దక్కింది. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జగద్గురు ఆది శంకరాచార్యుల వారు స్థాపించిన దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం ఆస్థాన జ్యోతిర్విద్వాంసులుగా ఆయన నియమితులయ్యారు. 

విజయదశమి సందర్భంగా శృంగేరి శారదా పీఠం లో జరిగిన ప్రత్యేక ఉత్సవంలో జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ  విధుశేఖర భారతీ స్వామి వారు శంకరమంచి రామకృష్ణ శాస్త్రిని జ్యోతిర్విద్వాంసులుగా నియమిస్తూ పట్టాను ప్రదానంచేసి ఆశీర్వదించారు. 

తెలుగు రాష్ట్రాల లోనే కాక దేశ వ్యాప్తంగా జ్యోతిషశాస్త్ర ప్రాభవాన్ని సూర్య సిద్ధాంతం వైశిష్ట్యాన్ని ఇనుమడింప చేసి మరింత కృషి సాగించాలని జగద్గురువులు ఆశీర్వదించారు.

తెలుగునాట అతి పిన్న వయసులోనే జ్యోతిష శాస్త్రాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేసి మూడు పి హెచ్ డి పట్టాలు,నాలుగు బంగారు పతకాలను అందుకున్నారు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి.  దీంతోపాటు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పరిశోధన పత్రాలను, కీలక ప్రసంగం పత్రాలను అందించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios