Asianet News TeluguAsianet News Telugu

అప్పుడే పుట్టిన ఆడపిల్లను.. మురికి కాలువలోకి విసిరేసిన మహిళ

అప్పడే పుట్టిన ఓ ఆడపిల్లను ఓ మహిళ మురికి నీటి కాలువలోకి పడేసి వెళ్లి పోయింది. కాగా... రక్తపు వాసనను పసిగట్టిన రెండు కుక్కలు ఆ బిడ్డను నోట కరుచుకొని లాక్కోని పోయాయి. 

Dogs rescue newborn from drain in Haryana's Kaithal; CCTV shows mother dumping child
Author
Hyderabad, First Published Jul 20, 2019, 2:05 PM IST

ఆడపిల్లగా పుట్టడమే ఆ బిడ్డ చేసిన నేరమా? తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చి కనీసం గంటలు కూడా గడవక ముందే మురికి కాలువలోకి చేరింది. అలా బిడ్డ మురికి కాలువలోకి చేరగానే... ఆ బిడ్డను రెండు కుక్కలు నోట కరుచుకొని లాక్కోని పోయాయి. ఈ విషాదకర సంఘటన హర్యానాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... హర్యానా రాష్ట్రం ఖైతల్ ప్రాంతంలో శుక్రవారం అప్పడే పుట్టిన ఓ ఆడపిల్లను ఓ మహిళ మురికి నీటి కాలువలోకి పడేసి వెళ్లి పోయింది. కాగా... రక్తపు వాసనను పసిగట్టిన రెండు కుక్కలు ఆ బిడ్డను నోట కరుచుకొని లాక్కోని పోయాయి. కాగా... ఈ దృశ్యాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆ కుక్కల బారి నుంచి బిడ్డను కాపాడి... ఆస్పత్రిలో చేర్పించారు.

బిడ్డ ప్రాణాలతోనే ఉందని కాకపోతే... పరిస్థితి మాత్రం విషమంగా ఉందని వైద్యులు  చెబుతున్నారు. కాగా.. ఓ మహిళ ఆ బిడ్డను మురికి నీటి కాలువలో పడివేయడం సమీపంలో సీసీ టీవీలో రికార్డు అయ్యింది. ఆ వీడియో ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా... ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. బిడ్డ పరిస్థితి విషమంగా ఉందని.. ఆమెను రక్షించడానికి తాము శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios