Asianet News TeluguAsianet News Telugu

ఇక‌పై జీన్స్, టీ-షర్టులు ధరిస్తే.. ఆఫీసులోకి నో ఏంట్రీ.. ఉద్యోగుల‌కు ఆదేశాలు

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలోని  జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలోని ఉద్యోగులు, అధికారులు డ్రెస్ కోడ్ పై ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు అధికారిక దుస్తులు ధరించాలని, తద్వారా వారు అధికారుల్లాగే కనిపించాలని బరేలీ డీఎం శివకాంత్ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు.

DM in UP district bans jeans, t-shirts in office
Author
First Published Sep 7, 2022, 2:52 PM IST

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలోని  జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలోని ఉద్యోగులు, అధికారులు జీన్స్, టీ-షర్టులు ధరించి కార్యాలయంలోకి వెళ్లడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కఠినంగా అమలు చేయాలని బరేలీ జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆర్డర్‌ను కార్యాలయ సిబ్బంది సానుకూలంగా తీసుకోవడంతో ఇప్పుడు అందరూ ఫార్మల్ దుస్తులు ధరించి కనిపిస్తున్నారు. ఫార్మల్ డ్రస్ కోడ్ ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని, ఉద్యోగులను హెచ్చరించారు. 

ఈ ఆదేశాల‌పై  జిల్లా మేజిస్ట్రేట్ శివకాంత్ ద్వివేది మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు అధికారులలా కనిపించేలా దుస్తులు ధరించాలని సూచించారు. క్యాజువల్స్ వేసుకోవాలనుకునే వారు బయట వేసుకోవచ్చు. గతంలో కూడా చాలా సార్లు డ్రెస్ కోడ్ కోసం లిఖితపూర్వక ఆదేశాలు జారీ అయ్యాయి. డ్రెస్ కోడ్ వేసుకోవాల‌ని, అధికారిక దుస్తులు ధరించాలని కోరారు. కార్యాలయానికి జీన్స్, టీ-షర్టులు ధరించకూడదని ప్రకటించాడు.

జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలను అభినందిస్తూ.. ఉద్యోగులు కార్యాలయంలో అధికారిక దుస్తులు ధరించాలని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శివేష్ కుమార్ గుప్తా అన్నారు. ఇప్పటికే ప‌లు ఆఫీసులో డ్రెస్ కోడ్ ధ‌రిస్తున్నార‌ని,  ఇది కొత్త విషయం కాదనీ, ఆఫీసులో సీనియర్లందరూ ఫార్మల్ డ్రెస్ లో వస్తారు. జీన్స్ వేసుకోరు. యువ‌  సహోద్యోగులలో కొందరు కొన్నిసార్లు జీన్స్,  టీ-షర్టులు ధరిస్తారు. కానీ వారికి కూడా సూచనలిచ్చారు. కాబట్టి అందరూ డ్రెస్ కోడ్‌తో సంతోషంగా ఉన్నారు. మాకు ఎటువంటి తేడా లేదు. అందరూ ఫార్మల్ డ్రెస్ లో రావాలని  ఆదేశించ‌డం మంచి నిర్ణయమే.. .

 గతంలో ప‌లుమార్లు నిషేధం 

అధికారులు ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా ఇలాంటి చర్య తీసుకుంది.  రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జీన్స్, టీ షర్టులు ధరించడాన్ని నిషేధించింది. గత సంవత్సరం.. మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగులు సాధారణ దుస్తులు ధరించడాన్ని నిషేధించింది. అంతేకాకుండా.. 2021లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ కూడా అధికారులందరూ అధికారిక దుస్తులలో కార్యాలయానికి రావడాన్ని తప్పనిసరి చేశారు. కార్యాలయంలోకి జీన్స్, టీ షర్టులు, స్పోర్ట్స్ షూలు, చెప్పులు, క్యాజువల్ డ్రెస్‌లను అనుమతించబోమని సీబీఐ డైరెక్టర్ గతేడాది ప్రకటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios