Asianet News TeluguAsianet News Telugu

రజనీ ప్రకటన నిరాశ పరిచింది... కమల్ హాసన్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తనింక రాజకీయాల్లోకి రానని ఈ ఉదయం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిమీద ఆయన అభిమానుల తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్  కొత్త పార్టీ ఏర్పాటుపై వెనక్కి తగ్గుతున్నట్టు చేసిన ప్రకటనపై మక్కల నీది మయ్యం అధినేత, ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ స్పందించారు. 

Disappointed says Kamal Haasan after Rajinikanth drops political plans - bsb
Author
Hyderabad, First Published Dec 29, 2020, 5:23 PM IST

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తనింక రాజకీయాల్లోకి రానని ఈ ఉదయం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిమీద ఆయన అభిమానుల తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్  కొత్త పార్టీ ఏర్పాటుపై వెనక్కి తగ్గుతున్నట్టు చేసిన ప్రకటనపై మక్కల నీది మయ్యం అధినేత, ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ స్పందించారు. 

రజనీ చేసిన ప్రకటన ఆయన అభిమానుల్లాగే తననూ ఎంతో నిరాశకు గురి చేసిందన్నారు. అదే సమయంలో ఆయన ఆరోగ్యం కూడా తనకెంతో ముఖ్యమన్నారు. 

ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఉన్న కమల్ ప్రచారం ముగిసిన తరువాత రతజీకాంత్ ను కలుస్తానని చెప్పారు. తమిళనాడు అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ కమల్ హాసన్ ప్రస్తతం తిరుచ్చిలో మూడో విడత ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. 

మహమ్మారి సమయంలో పార్టీని ప్రారంభించాలన్న నిర్ణయం సరైంది కాదని రజనీకాంత్ స్పష్టంగా చెప్పారు. "నేను రాజకీయ పార్టీని ప్రారంభించిన తరువాత ప్రచారం కోసం న్యూస్ మీడియా, సోషల్ మీడియాను బట్టి రాజకీయాల్లో తిరుగుబాటు తీసుకురావడం, పెద్ద విజయాన్ని సాధించడం అసాధ్యం. రాజకీయాల్లో అనుభవం ఉన్నవారు ఈ వాస్తవాన్ని ఖండించరు. నేను ప్రచారం కోసం ప్రజల వద్దకు వెళ్లాలి. వేలాది, లక్షలాది మందిని కలవాలి. 120 మంది అన్నాత్తే  సిబ్బందిలో కొంతమందికి కరోనా సోకింది. ఇక నేను మూడు రోజులు వైద్యుల పరిశీలనలో ఉండాల్సి వచ్చింది.

ఇప్పుడు కరోనా రూపం మార్చుకుంది. వేరియంట్ వేగంగా వ్యాప్తి అవుతోంది. ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చినా, నేను రోగనిరోధక మందులను తీసుకున్నప్పటికీ  నా ఆరోగ్యానికి ఏదైనా జరిగితే, నన్ను విశ్వసించి, నాతో చేరిన వ్యక్తులు మానసికంగా, ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. నేను రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించానని ప్రజలు అడుగుతారని నా స్నేహితులను నేను త్యాగం చేయలేను. నన్ను క్షమించండి, ఎందుకంటే ఈ నిర్ణయం రజిని మక్కల్ మండ్రాంలో ఉన్నవారికి, నేను రాజకీయాల్లోకి వస్తానని ఊహించిన వారికి నిరాశ కలిగించేది ”అని రజనీకాంత్ మంగళవారం విడుదల చేసిన మూడు పేజీల ప్రకటనలో తెలిపారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios