ఇటీవల తాను రాసిన ఉత్తరానికి భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ప్రత్యుత్తరం ఇవ్వడం పట్ల  చాలా ఆనందంగా ఉందని చిన్నారి లిడ్వానా జోసెఫ్ పేర్కొంది. ఆయన నుంచి తనకు భారత రాజ్యాంగ ప్రతి కూడా రావడం చాలా ఆనందాన్ని కలిగించిందని పేర్కొంది.

‘‘సీజేఐ నుంచి సమాధానం వస్తుందని ఊహించలేదు. నాకెంతో ఆనందంగా, గర్వంగా ఉంది’’ అని లిడ్వినా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఆక్సిజన్‌ అందుబాటులో లేక పెద్ద సంఖ్యలో కొవిడ్‌ మరణాలు సంభవించినట్లుగా రోజూ పేపర్లలో వార్తలు చదివిన ఆ చిన్నారి చలించిపోయింది. కొవిడ్‌ నియంత్రణ, ఆక్సిజన్‌ సరఫరా విషయంలో సుప్రీంకోర్టు పలు ఆదేశాలివ్వడంతో ఆమె సీజేఐ రమణకు ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాసింది. కోర్టులో ఒక కేసు విచారణ దృశ్యాన్ని ఆమె సృజనాత్మకంగా బొమ్మ గీసి పంపింది. దీనిపై సీజేఐ రమణ ఆమెకు బదులిచ్చారు. తన కుమార్తె రోజూ దినపత్రికలు చదువుతుందని, కొవిడ్‌ మరణాలు ఆమెకు మనోవేదన కలిగించాయని లిడ్వినా తండ్రి జోసెఫ్‌ ఫ్రాన్సిస్‌ చెప్పారు. ఆ ఆవేదనతోనే సీజేఐకి లేఖ రాసిందన్నారు.