ఢిల్లీ గాలి నాణ్య‌త మ‌రింత దిగ‌జారింది. దేశ రాజధానిలోని చాలా ప్రాంతాల్లో బుధవారం గాలి నాణ్య‌త ‘వెరీ పూర్’ కేట‌గిరీగా న‌మోదైంది. సఫర్ అంఛనాల ప్రకారం నేటి ఉదయం ఢిల్లీలో AQI 312గా నమోదు చేసింది. 

ఢిల్లీ (delhi) గాలి నాణ్య‌త మ‌రింత దిగ‌జారింది. గాలి వేగం త‌గ్గ‌డ‌మే దీనికి కార‌ణంగా క‌నిపిస్తోంది. దీంతో కాలుష్యం మ‌రింత పెరిగింది. ఈ మేర‌కు సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR) తాజా అంఛ‌నాల‌ను విడుద‌ల చేసింది. ఢిల్లీ ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ల వ‌ల్ల నెల రోజుల క్రితం గాలి నాణ్య‌త కొంత మెరుగుప‌డింది. కానీ ఇటీవ‌ల పెరిగిన చ‌లి తీవ్ర‌త‌, ద‌ట్ట‌మైన పొగ‌మంచు వ‌ల్ల మ‌ళ్లీ వాయు కాలుష్యం పెరిగింది. బుధ‌వారం స‌ఫ‌ర్ (SAFAR) విడుద‌ల చేసిన గ‌ణాంకాల ప్ర‌కారం దేశ రాజ‌ధానిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (Air Qulity Index) బుధ‌వారం ఉద‌యం 312కి చేరుకుంది. దీంతో ఢిల్లీలో నేడు గాలి నాణ్య‌త ‘వెరీ పూర్’ (very poor) కేట‌గిరీగా న‌మోదైంది. 

దేశ రాజ‌ధానిలోని ప‌లు ప్రాంతాల్లో ఉద‌యం 6.30 గంటలకు న‌మోదైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ల‌ను (AQI) స‌ఫ‌ర్ అంచ‌నా వేసింది. ఢిల్లీ యూనివర్సిటీ (Delhi univercity) AQI 339, పూసా (pusa) AQI 333, లోధి రోడ్ (lothi road) AQI 330 , మధుర రోడ్ (mathura road) AQI 327, ఐఐటీ -ఢిల్లీ (IIT - delhi) AQI 332, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (టెర్మినల్ 3) AQI 327 సహా ఢిల్లీలోని అనేక ప్రాంతాలు ‘వెరీ పూర్’ (very poor) కేటగిరీలో AQI న‌మోదు చేసింది. అయితే NCR ప్రాంతంలో మాత్రం స్వ‌ల్పంగా మెరుగుప‌డింది. గురుగ్రామ్ 269 AQIతో ‘పూర్’ కేట‌గిరిలో గాలి నాణ్యతను నమోదు చేయగా, నోయిడా ప్రాంతంలో మాత్రం నేటి ఉద‌యం ఉదయం AQI 332తో ‘వెరీ పూర్’ కేట‌గిరిగా నమోదైంది. 

మంగళవారం కూడా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో AQI ‘వెరీ పూర్’గా న‌మోదైంది. వ‌చ్చే మూడు రోజుల్లో (జ‌న‌వ‌రి 19,20,21) కూడా గాలి వేగం త‌గ్గుతుంద‌ని, ఇదే స‌మ‌యంలో క‌నిష్ట ఉష్ణోగ్ర‌త పెరుగుతుంద‌ని స‌ఫ‌ర్ (safar) అంఛ‌నా వేసింది. అయితే AQI ‘వెరీ పూర్’ కేట‌గిరిలోనే ఉంటుంద‌ని తెలిపింది. జ‌న‌వ‌రి 22వ తేదీన ఢిల్లీలో వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని స‌ఫ‌ర్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. దీని వ‌ల్ల AQI కాస్త మెరుగుప‌డి ‘వెరీ పూర్’ నుంచి ‘పూర్’ (poor) కేట‌గిరికి మారుతుంద‌ని స‌ఫ‌ర్ అంఛ‌నా వేసింది. 

సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR) గాలి నాణ్య‌త విభాగాల‌ను, కేట‌గిరీల‌ను నిర్ణ‌యిస్తుంది. దాని ప్రకారం ఎయిర్ క్వాలిటీ 51 నుంచి 100 AQI గా న‌మోదైతే ‘సాటిస్ఫెక్టరీ’ (satisfactory)’ లేదా ‘గుడ్’ (good) గా పరిగణిస్తుంది. 101-200 AQI గా నమోదైతే ‘మోడరేట్’ (moderate) గా పరిగణిస్తుంది. అలాగే 201-300 AQI గా నమోదైతే ‘పూర్’ (por) కిందకు వస్తుంది. అలాగే 300-400 AQI గా నమోదైతే ‘వెరీ పూర్’ (very poor)గా పరిగణిస్తుంది. అయితే 401-500 మధ్యన నమోదైతే మాత్రం ‘డేంజరస్’ (dangers) కేటగిరి కిందకు వస్తుంది.