Asianet News TeluguAsianet News Telugu

పీటీ ఉషా రికార్డు బద్దలు కొట్టిన యువతి..!

జాతీయ సీనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం జరిగిన 200 మీటర్ల సెమీఫైనల్‌ హీట్‌ను అందరి కంటే ముందుగా 23.26 సెకన్లలో ముగించిన ధనలక్ష్మి మొదటి స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించింది. 

Dhana Lakshmi beats Hima das in 200m semifinals, breaks PT Usha's meet record
Author
Hyderabad, First Published Mar 19, 2021, 8:51 AM IST

పరుగుల రాణి పీటీ ఉషా గురించి తెలియని వారు ఉండరు. వేగంగా పరుగులు తీయడంలో ఆమెకు ఆమే సాటి.  కాగా.. అలాంటి ఆమె రికార్డును ఓ యువతి తిరగరాసింది.

ఫెడరేషన్‌ కప్‌ మహిళల 200 మీటర్ల పరుగులో 23 ఏళ్లుగా అథ్లెటిక్స్‌ దిగ్గజం పీటీ ఉష పేరు మీద చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును తమిళనాడుకు చెందిన ఎస్‌ ధనలక్ష్మి తిరగరాసింది. జాతీయ సీనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం జరిగిన 200 మీటర్ల సెమీఫైనల్‌ హీట్‌ను అందరి కంటే ముందుగా 23.26 సెకన్లలో ముగించిన ధనలక్ష్మి మొదటి స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించింది. 

దాంతో 1998లో ఇదే మీట్‌లో పీటీ ఉష నెలకొల్పిన 23.30 సెకన్ల రికార్డు కనుమరుగైంది. రెండు రోజుల కిందట 100 మీటర్ల పరుగులో ద్యుతీచంద్‌కు షాక్‌ ఇస్తూ స్వర్ణం నెగ్గిన ధనలక్ష్మి... 200 మీటర్ల సెమీస్‌ హీట్‌లోనూ మరో స్టార్‌ స్ప్రింటర్‌ హిమదాస్‌ (24.39 సెకన్లు) కంటే మెరుగైన టైమింగ్‌ను నమోదు చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios