చికెన్ లేదన్నాడని ఏకంగా దాబానే తగలబెట్టేశారు ఆ ఘనులు. చికెన్ అంటే వారికున్న పిచ్చి ఆ దాబా ఓనర్ పాలిట విషాదంగా మారింది. తాగిన మత్తులో దాబాకు నిప్పంటించేశారు. ఆదివారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
చికెన్ లేదన్నాడని ఏకంగా దాబానే తగలబెట్టేశారు ఆ ఘనులు. చికెన్ అంటే వారికున్న పిచ్చి ఆ దాబా ఓనర్ పాలిట విషాదంగా మారింది. తాగిన మత్తులో దాబాకు నిప్పంటించేశారు. ఆదివారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాలు.. శంకర్ టైడే(29), సాగర్ పటేల్(19) అనే ఇద్దరు చికెన్ ప్రేమికులు.. ఫుల్‌గా మద్యం సేవించారు. తాగుతూ, ఊగుతూ అర్దరాత్రి ఒంటిగంట టైంలో బెల్టారోడి ప్రాంతంలోని రోడ్డుపక్కన ఉన్న ఓ దాబా హోటల్‌కు వెళ్లారు.
అక్కడ తమకు చికెన్ ఐటమ్ కావాలంటూ ఆర్డర్ చేశారు. అయితే అప్పటికే ఆ దాబాలో చికెన్ అయిపోంది. ఇదే విషయాన్ని దాబా ఓనర్ వారికి చెప్పి, చికెన్ దొరకదని అన్నాడు. తాగిన మత్తులో ఉన్నశంకర్, సాగర్‌లు దీన్ని ఒప్పుకోలేదు. తమకు చికెన్ కావాల్సిందేనని దాబా ఓనర్‌తో వాదనకు దిగారు.
ఈ గొడవ ముదరడంతో ఆవేశానికి లోనైన వీరిద్దరు దాబాకు నిప్పంటించారు. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి హాని జరగలేదు. దాబాలోని వారంతా బయటకు రావడంతో ప్రమాదం తప్పింది. దాబా కాలిపోవడంతో ఆస్తి నష్టం మాత్రం జరిగింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇక, కేసు నమోదు చేసుకుని నిందితులను విచారిస్తున్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 11, 2021, 12:24 PM IST