ఢిల్లీలోని జహంగీర్‌పురిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడా కూల్చివేతలు కొనసాగంపై నిరసనలు వ్యక్తం చేశారు.


న్యూఢిల్లీ: ఢిల్లీలోని Jahangirpuriలో అక్రమణల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయితే జహంగీర్‌పురిలో ఆక్రమణలు కూల్చివేయకూడదని Superme Court ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆక్రమణల కూల్చివేతలను నిలివివేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు తమకు అందలేదని కూడా అధికారులు చెబుతున్నారు. సుప్రీం ఆదేశాలు అందే వరకు తాము ఆక్రమణలను కూల్చివేస్తామని కూడా ప్రకటించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

 New Delhiలోని జహంగీర్‌పురిలోని Masjid సమీపంలో ఆక్రమణల కూల్చివేతను నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ చేపట్టింది. అనుమతి లేకుండా చేపట్టిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అందిన ఫిర్యాదు మేరకు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అయితే ఈ నెల 16న జహంగీర్ పురిలోని మసీదు వద్దే ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకొన్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆదేశాలు తమకు అందలేదని మున్సిపల్ అధికారులు కూల్చివేతలను కొనసాగించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆక్రమణల కూల్చివేతలు కొనసాగుతున్న ప్రాంతానికి సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ వెళ్లి ఆందోళన చేశారు. అయితే మధ్యాహ్నం 1 గంట తర్వాత ఆక్రమణల కూల్చివేతలపై సుప్రీంకోర్టు ఆదేశాలు అందడంతో మున్సిపల్ అధికారులు కూల్చివేతలను నిలిపివేశారు.