ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ సబ్ ఇన్ స్పెక్టర్ (ఏఎస్ఐ) తన వ్యానులోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన శనివారం ఉదయం జరిగింది. జకీరా ఫ్లైఓవర్ దగ్గర్లో తన పీసీఆర్ వ్యాన్లోనే ఆయన తుపాకితో ఛాతిమీద కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

మృతుని ఏఎస్ఐ తేజ్ పాట్ గా గుర్తించారు. విది నిర్వహణ సమయంలోనే తేజ్ పాల్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. వ్యానులో ఉన్న పోలీసులు కిందికి దిగగానే తేజ్ పాల్ తనమీద తాను కాల్పులు జరుపుకున్నట్టు తేలింది. 

అయితే తేజ్ పాల్ ఆత్మహత్య వెనుక కారణమేంటో తెలియలేదు. దీనిమీద పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పోలీసులు గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం జరుగుతూనే ఉన్నాయి. 

గతేడాది జూన్ లో ఇదే తరహా ఘటన ఢిల్లీలోనే మరోటి జరిగింది. ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ సందీప్ కుమార్ వసంత్ విహార్ ప్రాంతంలోని పోలీసు స్టేషన్‌లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపు అతను కన్నుమూశాడు.