భర్తను కాదని వివాహేతర సంబంధం పెట్టుకుంది. కానీ ఆ బంధం తప్పని తెలుసుకునేలోపే ఆమె ప్రాణాలు పోగొట్టుకుంది. భర్తకు విడాకులు ఇవ్వడంలేదని  ఆమెను ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన పింకీకి 19ఏళ్ల వయసులో ఐదేళ్ల క్రితం వివాహం అయ్యింది.  సంవత్సరం తిరిగేలోపు ఓ బిడ్డకు తల్లి అయ్యింది. భర్త ఎప్పుడూ తన వర్క్ తో బిజీగా ఉండటంతో... ఆమె కూడా సొంతంగా తనకంటూ ఓ వ్యాపకం ఏర్పాటు చేసుకుంది. ప్రత్యేకంగా ఓ బ్యూటీపార్లర్ పెట్టుకుంది. దాని ద్వారా ఆమెకు చాలా మంది స్నేహితులు ఏర్పడ్డారు.

కొంతకాలం క్రితం ఆమెకు ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా..సన్నీ అనే యువకుడు పరిచయం అయ్యాడు.తొలుత ఫ్రెండ్స్ అయ్యారు. సరదాలు, షికార్లు అంటూ తిరిగారు. శారీరకంగా కూడా ఒక్కటయ్యారు. ఈ విషయం పింకీ భర్తకు తెలిసింది. వెంటనే ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చి ఇంటి మకాం మార్చేశాడు.

అయితే... సన్నీ మాత్రం ఆమెను కలవడం ఆపలేదు. ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో రహస్యంగా వెళ్లి కలిసేవాడు. అయితే... తాను చేస్తున్న పని తప్పని పింకీ భావించింది. అప్పటి నుంచి సన్నీని దూరం పెట్టడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో సన్నీ.. పింకీ ని తన భర్తకు విడాకులు ఇవ్వాలని ఒత్తిడి తీసుకువచ్చాడు. ఆమె అందుకు అంగీకరించలేదు. చాలాసార్లు బ్రతిమిలాడాడు. కానీ ఆమె కనికరించలేదు. దీంతో... కోపంతో ఊగిపోయిన సన్నీ... పింకీ ని కత్తితో పొడిచాడు. దాదాపు 12, 13సార్లు పొట్టలో, చాతిలో పొడిచి హత్య చేశాడు. అనంతరం తన గొంతు కూడా కోసుకున్నాడు.

గమనించిన పింకీ భర్త... భార్యను ఆస్పత్రికి తరలించాడు. ఆమె ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ చనిపోగా.. సన్నీ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నాడు.పింకీ భర్త ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.