న్యూఢిల్లీ: ఆస్తి తగాదాల నేపథ్యంలో తండ్రిని హత్య చేశాడు ఓ కొడుకు.ఈ ఘటన న్యూఢిల్లీలో చోటు చేసుకొంది. 22 ఏళ్ల అమన్ కుమార్  తన తండ్రిని హత్య చేశాడు. అంతేకాదు మృతదేహాన్ని 25 ముక్కలు చేసినట్టుగా పోలీసులు చెప్పారు.

మృతదేహన్ని 25 ముక్కలుగా చేసి నాలుగు బ్యాగుల్లో పెట్టాడు. ఈ నాలుగు బ్యాగులను వేరే ప్రదేశంలో వేసేందుకు తన నలుగురు స్నేహితులతో కలిసి ఆమన్ కుమార్ వెళ్తున్న సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. 

48 ఏళ్ల సందేశ్ అగర్వాల్‌తో అమన్ కుమార్ గొడవ పెట్టుకొన్నాడు. సందేశ్ అగర్వాల్ అమన్ తండ్రి. ప్రతి రోజూ తన తండ్రి తనను తిడతాడని అమన్ కుమార్ చెప్పాడని పోలీసులు చెప్పారు. రోజూ ఈ తిట్లను భరించలేక హత్యకు పాల్పడినట్టుగా తమ విచారణలో ఆయన ఒప్పుకొన్నాడని పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉంటే నెల రోజుల క్రితమే తన సోదరుడిని హత్య చేస్తానని అమన్ కుమార్ చెప్పాడని  సందేశ్  సోదరుడు చెప్పారు. ఈ హత్యలో సందేశ్ కుమార్ భార్య, మరికొందరు కూడ భఆగస్వామ్యులుగా ఉన్నారని  ఆయన ఆరోపించారు.

కాస్మోటిక్ దుకాణం నిర్వహించే సందేశ్ కుమార్‌పై ఆస్తి వివాదాలు ఉన్నాయని ఆయన సోదరుడు చెప్పారు. కొన్ని కేసులు కూడ కోర్టులో సాగాయన్నారు.  తన పేరున ఉన్న సగం ఆస్తిని సందేశ్ కుమార్ భార్య పేరున కూడ బదిలీ చేశారని మృతుడి సోదరుడు గుర్తు చేశారు.  అయినా కూడ వారి ఆశలు తీరలేదన్నారు. కాస్మోటిక్స్ దుకాణాన్ని తమ పేరున మార్చాలని తన సోదరుడిపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు.