Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ లిక్కర్ స్కాం: కేజ్రీవాల్ కు ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ కస్టడీ

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలని కోర్టు ఆదేశించింది.

Delhi Liquor policy case: Court sends Arvind Kejriwal to judicial custody till April 15 lns
Author
First Published Apr 1, 2024, 12:02 PM IST

న్యూఢిల్లీ:  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు  ఈ నెల  15వ తేదీ వరకు  జ్యుడిషీయల్ కస్టడీ విధిస్తూ  రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.ఈ ఏడాది మార్చి  21న  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు.  అరెస్టైన తర్వాత  కేజ్రీవాల్ ను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. లిక్కర్ స్కాంలో  కేజ్రీవాల్ ను విచారించాల్సి ఉన్నందున కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరారు. దీంతో  ఈడీ అధికారుల కస్టడీకి కోర్టు అనుమతిని ఇచ్చింది. ఇవాళ్టితో  ఈడీ కస్టడీ ముగిసింది. దరిమిలా ఇవాళ కోర్టును కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు హాజరుపర్చారు. 

భవిష్యత్తులో ఈడీ అధికారులు మరోసారి కేజ్రీవాల్ ను కస్టడీ కోరే అవకాశం లేకపోలేదు. మరో వైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మరో కేసులో అరెస్టైన సత్యేంద్రజైన్,  ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడ అరెస్టయ్యారు.ఈ ముగ్గురు కూడ తీహర్ జైలులోనే ఉన్నారు. మరో వైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో  అరెస్టైన భారత రాష్ట్ర సమితి  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  కూడ ప్రస్తుతం తీహర్ జైలులోనే ఉన్నారు

Follow Us:
Download App:
  • android
  • ios