తనపై తప్పుడు అభియోగాలు మోపినందుకు ఆప్ నేత‌లు సౌరభ్ భరద్వాజ్, అతిషి, దుర్గేష్ పాఠక్, జాస్మిన్ షా తదితరులపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. వారిపై పరువునష్టం దావా వేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన ఎల్‌జీ కార్యాలయం జారీ చేసింది.  

తప్పుడు అభియోగాలు మోపినందుకు ఆప్ నేతలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. రూ.1,400 కోట్లు అవినీతికి పాల్పడ్డారంటూ త‌ప్పుడూ ఆరోపణలు చేసిన ఆమ్‌ ఆద్మీ నేతలపై పరువునష్టం దావా వేయనున్నట్లు ఆయ‌న‌ స్పష్టం చేశారు. త‌న‌ గౌరవానికి భంగం కలిగించే విధంగా అవినీతి ఆరోపణలు చేసిన ఎమ్మెల్యేలు అతిష్‌, సౌరభ్‌ భరద్వాజ్‌లతో అతిషి, దుర్గేష్ పాఠక్, జాస్మిన్ షా తదితరులపై పరువునష్టం దావా వేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఎల్‌జీ కార్యాలయం ఓ ప్రకటన జారీ చేసింది. 

‘ఒకరిపై ఆరోపణలు చేస్తూ.. రాజ‌కీయం చేసే.. లక్షణం కేజ్రీవాల్‌ అండ్‌ కోది. ఆప్‌ నేతలు చేసిన తప్పుడు 
ఆరోప‌ణ‌లు, పరువు నష్టం కలిగించే చ‌ర్య‌ల‌పై ఎల్‌జీ సక్సెనా దృష్టి సారించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఆప్‌ నేతల‌పై పరువునష్టం దావా వేయనున్నారు. ’ అని ఎల్‌జీ సక్సేనా కార్యాలయం పేర్కొంది.

ఎల్‌జీ సక్సెనా 2016 లో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమీషన్ చైర్మన్ (కెవిఐసి)గా ఉన్న సమయంలో
 ₹ 1,400 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, నోట్ల రద్దు సమయంలో ఎల్‌జీ సక్సెనా సుమారు రూ.1,400 కోట్లు రద్దు చేసిన నోట్లు మార్పిడి చేయించారని ఆప్‌ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే.. సక్సేనా తన ఇద్దరు అనుచరులపై కూడా ఒత్తిడి తెచ్చారని ఆప్ ఆరోపించింది. అయితే, ఆ ఆరోపణలను సక్సేనా తిప్పికొట్టారు.

ఎమ్మెల్యేలతో పాటు ఢిల్లీ డైలాగ్ అండ్ డెవలప్‌మెంట్ కమిషన్ వైస్ చైర్మన్ జాస్మిన్ షాపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ త‌రుణంలో సక్సేనా రాజీనామా చేయాలని ఆప్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మ‌రోవైపు.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు సత్యేందర్ జైన్ మరియు మనీష్ సిసోడియాలను బర్తరఫ్ చేయాలని బిజెపి శాసనసభ్యులు ఒత్తిడి చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌ ఆప్ మంత్రులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ఢిల్లీ అసెంబ్లీలో వరుసగా రెండో రోజు రాత్రిపూట నిరసన కొనసాగించారు. అధికార ఆప్‌, బీజేపీ నేతలు చేసిన పలుమార్లు వాయిదాలు, నినాదాల మధ్య బీజేపీ ఎమ్మెల్యేలను మూడోరోజు సభ నుంచి బయటకు వచ్చారు. అవినీతి ఆరోపణలపై రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో సోమవారం ఆప్, బిజెపి ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో రాత్రిపూట నిరసనకు దిగారు.