Coronavirus: ఆందోళనను పెంచుతున్న ఢిల్లీ కరోనా కేసులు.. జీనోమ్ సీక్వెన్సింగ్ 300 శాంపిల్స్.. !

Coronavirus: దేశరాజధాని ఢిల్లీలో మళ్లీ పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు ఆందోళనను పెంచుతున్నాయి.  ఈ క్రమంలోనే ఇటీవల ఢిల్లీలో COVID-19 కు పాజిటివ్ పరీక్షించిన వ్యక్తులకు చెందిన దాదాపు 300 శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. 
 

Delhi corona cases raising concern .. 300 samples sent for genome sequencing ..!

Delhi COVID-19 : గత కొంత కాలంగా చాలా దేశాల్లో తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి ప్రభావం మళ్లీ పెరుగుతోంది. కొత్త కేసులు అధికంగా నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా కరోనా వైరస్ తన రూపు మార్చుకుంటూ కొత్త వేరియంట్ల పుట్టుకురావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. చైనా, దక్షిణ కొరియా స‌హా ప‌లు  యూర‌ప్ దేశాల్లో క‌రోనా వైర‌స్ కొత్త కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. ఇటీవ‌ల గుర్తించిన ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్లు ఇప్ప‌టివ‌ర‌కు వేగంగా వ్యాపించే.. అధిక ప్ర‌భావం క‌లిగిన వేరియంట్ల కంటే 10 రెట్లు ప్ర‌భావిత‌మైన‌విగా ఉంటాయ‌ని అంచ‌నాలున్నాయి. దీంతో మ‌ళ్లీ భార‌త్ లో క‌రోనా కేసులు పెర‌గ‌డంపై అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉంది. 

కొత్త కరోనావైరస్ వేరియంట్ ముప్పు మధ్య, ఇటీవల ఢిల్లీలో COVID-19 కు పాజిటివ్ పరీక్షించిన వ్యక్తుల నుండి దాదాపు 300 నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. గత కొన్ని రోజులుగా రోజువారీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధిక వ్యాప్తి క‌లిగించే అంచ‌నాలున్న‌ XE వేరియంట్  వంటి ఏదైనా కొత్త వేరియంట్ నగరంలో సర్క్యులేట్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి సీక్వెన్సింగ్ చేస్తున్న‌ట్టు సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ పంచుకున్న డేటా ప్రకారం.. ఢిల్లీలో  గ‌త 24 గంట‌ల్లో 366 కొత్త COVID-19 కేసులు మరియు సున్నా మరణాలు నమోదయ్యాయి.  అయితే సానుకూలత రేటు 3.95 శాతానికి పెరిగింది. రెండ్రోజుల క్రితం ఢిల్లీలో కోవిడ్-19 పాజిటివ్ అని తేలిన వ్యక్తుల నుంచి దాదాపు 300 శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సీక్వెన్సింగ్ ప్రాసెస్ చేయడానికి సుమారు 7-10 రోజులు పడుతుందని తెలిపారు.

ఇటీవ‌లే విదేశీ విమాన స‌ర్వీల‌సు ప్రారంభం కావ‌డం.. అంతర్జాతీయ ప్రయాణికులు న‌గ‌రంలోకి రావ‌డం వంటి కార‌ణాల‌తో కొత్త వేరియంట్లు నగరంలోకి ఇప్ప‌టికే ప్ర‌వేశించే అవ‌కాశ‌ముంద‌ని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. వీటిని ముందుగానే గుర్తించే మ‌రింత ఆందోళ‌న‌క‌రంగా ప‌రిస్థితులు మార‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకునే అవ‌కాశముంటుంద‌ని అధికార వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. UKలో మొదటిసారిగా కనుగొనబడిన Omicron కొత్త స‌బ్ వేరియంట్ XE పై ఆందోళ‌న వ్యక్తం చేస్తూ.. WHO ఒక హెచ్చరికను జారీ చేసింది. ఇది ఇప్పటివరకు ఉన్న అన్ని COVID-19 జాతి కంటే ఎక్కువగా వ్యాపించగలదని సూచించింది. XE వేరియంట్ అనేది Omicron  BA.1, BA.2 ఉప-వేరియంట్‌ల కలయిక లేదా రీకాంబినెంట్ అని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఇటీవ‌లే ఈ కేసుల‌ను గుజ‌రాత్‌, మ‌హారాష్ట్రల‌లో గుర్తించారు.  అయితే, కేంద్రం మాత్రం వీటిని ఇది XE వేరియంట్‌కు సంబంధించిన కేసు అని ప్రస్తుత ఆధారాలు సూచించలేదని పేర్కొంది. ఈ క్ర‌మంలోనే కరోనావైరస్ కేసులు, దేశ రాజధానిలో సానుకూలత రేటు గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ధోరణిని క‌నిపిస్తుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. 

శుక్రవారం 366 కొత్త కేసులతో క‌లుపుకుని దేశ రాజ‌ధాని ఢిల్లీలో మొత్తం కోవిడ్ సంఖ్య 18,67,572 కు పెరిగింది.  మరణాల సంఖ్య 26,158 గా ఉంది. COVID-19 పరిస్థితిపై ఢిల్లీ ప్రభుత్వం నిఘా ఉంచిందనీ, కొత్త వేరియంట్ల నేప‌థ్యంలో అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ చెప్పారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios