న్యూఢిల్లీ: ఇంటి నుండి వెళ్లిపోయిన పిల్లలను వారి కుటుంబాల వద్దకు చేర్చారు ఓ మహిళా కానిస్టేబుల్. ఇందుకు గాను ఆమె ప్రోత్సాహకాన్ని కూడ అందుకొన్నారు.

ఢిల్లీకి చెందిన హెడ్‌కానిస్టేబుల్ ప్రోత్సాహక పురస్కారాన్ని అందుకొన్నారు. 12 నెలల్లో 76 మంది పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించినందుకు గాను పోలీస్ శాఖ ఆమెకు ప్రమోషన్ ఇచ్చింది.

76 మందిలో 56 మంది పిల్లలు 14 ఏళ్లలోపువారే కావడం గమనార్హం. అసాధారణ్ కార్యా పురస్కార్ అవార్డుకు సీమాను ఎంపిక చేసినట్టుగా పోలీస్ శాఖ ప్రకటించింది.

కేవలం 3 నెలల్లో 56 మంది పిల్లలను కాపాడిన సీమాను అభినందనలు తెలిపారు.  పశ్చిమబెంగాల్ కు చెందిన ఇద్దరు, పంజాబ్ లోని హోషియార్ పూర్ జిల్లాకు చెందిన ఇద్దరు , గురుగావ్, ఘజియాబాద్, నోయిడా, పానిపట్, బీహార్ లతో పాటు ఢిల్లీల నుండి తప్పిపోయిన పిల్లలను కాపాడినట్టుగా ఆమె తెలిపారు.

పిల్లలు తప్పిపోతే ఆ కుటుంబం ఎంత బాధపడుతోందో  ఓ తల్లిగా తనకు తెలుసునని ఆమె చెప్పారు. దీంతోనే తాను తప్పిపోయిన పిల్లలను కాపాడినట్టుగా ఆమె తెలిపారు.