న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్  ఈ నెల 16వ తేదీన  ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో అరవింద్ కేజ్రీవాల్  మూడోసారి  ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.

ఈ నెల 8వ తేదీన జరిగిన ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను ఆప్ 62 స్థానాల్లో విజయం సాధించింది.  బీజేపీ 8 స్థానాలకే పరిమితమైంది.

Also read:న్యూఢిల్లీలో కలకలం: ఆప్ ఎమ్మెల్యే నరేష్ యాదవ్ కాన్వాయ్ పై కాల్పులు, ఒకరి మృతి

వరుసగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ పగ్గాలను చేపట్టనున్నారు.  రామ్‌లీలా మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి.ఢిల్లీ పీఠాన్ని దక్కించుకొనేందుకు బీజేపీ తన శక్తివంచన లేకుండా ప్రయత్నాలను చేసింది. కానీ బీజేపీకి ఈ దఫా నిరాశే మిగిలింది.

కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి బీజేపీయేతర పార్టీలకు చెందిన నేతలు, ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. ఢిల్లీలో ఆప్ మూడో దఫా అధికారాన్ని కైవసం చేసుకోవడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపింది.