ఇది మందుబాబులకు నిజంగా శుభవార్తే. ఎందుకంటే Liquor  Retailers.. దేశీయ బ్రాండ్లతో పాటుగా దిగుమతి చేసుకున్న బ్రాండ్‌లపై భారీ తగ్గింపు అందిస్తున్నారు. దాదాపు 30 నుంచి 40 శాతం వరకు తగ్గింపు ధరలకు వినియోగదారులకు మద్యం విక్రయిస్తున్నారు. 

ఇది మందుబాబులకు నిజంగా శుభవార్తే. ఎందుకంటే Liquor  Retailers.. దేశీయ బ్రాండ్లతో పాటుగా దిగుమతి చేసుకున్న బ్రాండ్‌లపై భారీ తగ్గింపు అందిస్తున్నారు. దాదాపు 30 నుంచి 40 శాతం వరకు తగ్గింపు ధరలకు వినియోగదారులకు మద్యం విక్రయిస్తున్నారు. అయితే ఇందంతా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు. దేశ రాజధాని ఢిల్లీలో భారీ డిస్కౌంట్లతో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఇందుకు అక్కడ అమల్లోకి వచ్చిన కొత్త మద్యం పాలసీనే కారణం. గతేడాది నవంబర్‌ నుంచి ఢిల్లీలో కొత్త నిబంధనలు అమల్లోకి రావడంతో.. బ్రాండెడ్ మద్యం MRPపై 30 నుంచి 40 శాతం వరకు తగ్గింపులు ఉంటున్నాయి.

ఢిల్లీలోని మద్యం విక్రేతలు.. సరిహద్దు నగరాలైన నోయిడా, గురుగ్రామ్‌ల కంటే భారీ తగ్గింపు ధరలతో అమ్మకాలు కొనసాగిస్తున్నారని ఆంగ్ల మీడియా సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి. ఒక నివేదిక ప్రకారం.. దేశ రాజధానిలోని కొన్ని దుకాణాల్లో విదేశీ బ్రాండ్ ఆల్కహాల్ Chivas Regal (12 సంవత్సరాలు) బాటిల్‌ను రూ. 1,890కి విక్రయిస్తున్నారు. మరోవైపు.. ఇదే బ్రాండ్‌ను గురుగ్రామ్ మూడు బాటిళ్ల కొనుగోలు చేస్తే ఒక్కో బాటిల్‌పై రూ.150 తగ్గింపుతో రూ. 2,150కు విక్రయిస్తున్నారు. ఢిల్లీలో Chivas Regal ఎమ్మార్పీ రూ. 2,920గా ఉంది. 

JSN ఇన్‌ఫ్రాటెక్ LLP ద్వారా నిర్వహించబడుతున్న Whiskey Theka లిక్కర్ షాప్‌లో ప్రీమియం ఆల్కహాల్ బ్రాండ్ జాక్ డేనియల్స్ బాటిల్‌ను రూ. 1,885కు అందిస్తున్నారు. అయితే ఢిల్లీలో దీని ఎమ్మార్పీ ధర రూ. 2,730గా ఉంది. ఇక, మరో ప్రీమియం బ్రాండ్ Glenlivet (18 ఏళ్ల బ్యాచ్ రిజర్వ్) 700 మిల్లీలీటర్ల బాటిల్‌కు రూ. 5,115కి విక్రయిస్తున్నారు. ఇది దాని ఎమ్మార్పీ ధర రూ. 7,415 కంటే చాలా తక్కువ.

కొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఢిల్లీలో వోడ్కా ధరలు కూడా తగ్గాయి. అబ్సోలట్ వోడ్కా ఇప్పుడు ఢిల్లీలో రూ. 995కి విక్రయించబడుతోంది. దాని ఎంఆర్‌పీ ధర రూ. 1,520పై దాదాపు 30 శాతం తగ్గింపుతో అమ్మకాలు సాగుతున్నాయి.  చాలా మంది రిటైలర్లు.. ఢిల్లీలో వైన్ ధరలపై భారీ తగ్గింపును అందిస్తున్నారు. ఉదాహరణకు, ఢిల్లీలో ఒక బాటిల్ జాకబ్స్ క్రీక్ ఎమ్మార్పీ ధర రూ. 1,180  ఉండగా రూ. 795కు.. Chateau Puygueraud ఎమ్మార్పీ రూ. 7,220 ఉండగా రూ. 4,980కు విక్రయిస్తున్నారు. 

ఆల్కో మార్ట్, నోవా గార్మెంట్స్ వంటి ప్రముఖ కంపెనీలు తమ స్టాక్‌పై 35 శాతం తగ్గింపును అందిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ రిటైలర్లు ఢిల్లీలోని వివిధ ప్రాంతాలలో కనీసం 27 దుకాణాలను కలిగి ఉన్నారు. ఢిల్లీలో అమల్లోకి వచ్చిన కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం మద్యం వ్యాపారం పూర్తిగా ప్రైవేటు ఆధీనంలోకి వెళ్లింది.