ఇద్దరు దొంగలు ఏకంగా ఏటీఎం ని ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలోని నరేలా ప్రాంతంలోని ఓ ఏటీఎంలో చోరీ జరిగింది. మంగళవారం అర్థరాత్రి ఒంటి గంట సమయంలో చోరీకి పాల్పడిన దొంగలు.. ఏకంగా ఏటీఏంనే ఎత్తుకెళ్లారు. అందులో రూ.18లక్షల నగదు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా.. నిందితులు సీసీ టీవీ కెమేరాను కూడా ధ్వంసం చేశారని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.  కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.