సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ తన స్పెషల్ మర్యాదలను పక్కనపెట్టేస్తున్నారు.

ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె చెన్నైకి వెళ్లారు. ఈ క్రమంలో ఢిల్లీకి తిరిగి వచ్చే క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో ప్రత్యేక విమానంలో వెళ్లాల్సిన ఆమె మనసు మార్చుకుని దేశీయ విమానంలో ఢిల్లీకి వెళ్లారు.

దానితో పాటు ప్రభుత్వ కారు, ఎస్కార్టు వాహనాలను కూడా ఆమె తిరస్కరించారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు ఓ బీజేపీ నేత కారునే వినియోగించారు.