బుర్ద్వాన్: పశ్చిమ బెంగాల్ మంత్రి కుటుంబ సభ్యులు దిక్కుమొక్కు లేని స్థితిలో మరణించారు. మంత్రి మలయ్ ఘటక్ బంధువులైన వయస్సు మళ్లిన మహిళ, ఆమె కూతురు శవాలు ఇంట్లో కుళ్లిపోయి పడి ఉన్నాయి. 

పశ్చిమ బెంగాల్ లోని అసన్ సోల్ పట్టణంలోని వారి ఇంట్లో ఇద్దరు మహిళలు మరణించారు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. అసన్ సోల్ లోని హిందుస్థాన్ పార్క్ ఏరియాలో ఉన్న ఆ ఇంట్లోకి పోలీసులు ప్రవేశించి, ఇద్దరి శవాలను గుర్తించారు. 

మృతులను జయశ్రీ ఘటక్, ఆమె కూతురు నీలం ఘటక్ లుగా గుర్తించారు. జయశ్రీ మంత్రి అన్నయ్య భార్య. వారిద్దరు కూడా తమతో మాట్లాడేవారు కాదని ఇరుగుపొరుగువారు అంటున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.