తిరువనంతపురం తైకవు గ్రామం జగథి ప్రాంతానికి చెందిన జిజు రాజ్ కు కొన్నేళ్ల క్రితం అనన్య కుమారితో పరిచయం ఏర్పడింది. ఇదర్దరూ కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం అనన్య కుమారి తన అపార్ట్ మెంట్ లో ఆత్మహత్య చేసుకుని మరణించింది. అనన్య మృతి వార్త తెలిసిన నాటినుంచి జిజూ రాజ్ తీవ్ర విషాదంలో ముగినిపోయాడు.

తిరువనంతపురం : ఈ వారం ప్రారంభంలో కేరళకు చెందిన తొలి ట్రాన్స్ జెండర్ రేడియో జాకీ, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన తొలి ట్రాన్స్ జెండర్ అనన్య కుమారి ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి తెలిసిందే. అనన్య మృతి తట్టుకోలేక ఆమె భాగస్వామి జిజు రాజ్ (36) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వివరాలు...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తిరువనంతపురం తైకవు గ్రామం జగథి ప్రాంతానికి చెందిన జిజు రాజ్ కు కొన్నేళ్ల క్రితం అనన్య కుమారితో పరిచయం ఏర్పడింది. ఇదర్దరూ కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం అనన్య కుమారి తన అపార్ట్ మెంట్ లో ఆత్మహత్య చేసుకుని మరణించింది. అనన్య మృతి వార్త తెలిసిన నాటినుంచి జిజూ రాజ్ తీవ్ర విషాదంలో ముగినిపోయాడు.

ఒంటరితనం వేధించసాగింది. ఈ బాధ నుంచి బయపడటం కోసం జిజూ కొచ్చిలోని తన స్నేహితుడి రూమ్ కి వెళ్లాడు. కానీ ముభావంగా ఉండసాగాడు. ఈ క్రమంలో శుక్రవారం స్నేహితుడు బైటికి వెళ్లిన తరువాత జిజు అతడి గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

అనన్య కుమారి లింగ మార్పిడి కోసం ఆరు సర్జరీలు చేయించుకుంది. కానీ వాటి వల్ల ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. తన అనారోగ్య సమస్యలకు ఆస్పత్రి వైద్యులే కారణమని ఆరోపించింది. వీటన్నింటితో డిప్రెషన్ కు లోనై అనన్య ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది.