Asianet News TeluguAsianet News Telugu

కేరళ గోల్డ్ స్కాం: దావూద్ ఇబ్రహీం కు లింకులు?

కేరళ బంగారం స్కామ్ లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ ప్రమేయం ఉండొచ్చని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. ఈ మేరకు బుధవారం నాడు ఎన్ఐఏ కోర్టుకు ఈ విషయాన్ని తెలిపింది.

Dawood Ibrahim Link Suspected In Kerala Gold Smuggling Case: NIA To Court lns
Author
Kerala, First Published Oct 15, 2020, 11:40 AM IST


న్యూఢిల్లీ: కేరళ బంగారం స్కామ్ లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ ప్రమేయం ఉండొచ్చని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. ఈ మేరకు బుధవారం నాడు ఎన్ఐఏ కోర్టుకు ఈ విషయాన్ని తెలిపింది.

గోల్డ్ స్మగ్లింగ్  ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు ఉఫయోగించారని ఇంటలిజెన్స్ అధికారుల సమాచారం అందిస్తోంది.కేరళ గోల్డ్ స్కాంలో పాల్గొన్నవారికి బెయిల్ ఇవ్వొద్దని ఎన్ఐఏ కోర్టును కోరింది.

ఈ కేసులో నిందితుడైన రమీస్ కథనం మేరకు టాంజానియాలో తనకు వజ్రాల వ్యాపారం ఉందని చెప్పాడు. అతను ఈ బంగారాన్ని యూఏఈలో విక్రయించినట్టుగా దర్యాప్తు అధికారులకు చెప్పిన విషయాన్ని ఈ నివేదికలు ప్రకటించాయి.

also read:కేరళ గోల్డ్ స్కీమ్: ఈడీ ఛార్జీషీట్‌లో కీలకాంశాలు

దావూద్ ఇబ్రహీంపై యూఎస్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆంక్షల కమిటీ  కథనాన్ని ఎన్ఐఏ  కోర్టుకు తెలిపింది.ఆఫ్రికాలో తన ముఠా కార్యకలాపాలపై యూఎస్ ట్రెజరీ విభాగం ప్రచురించిన పాక్ట్ షీట్ ను ఎన్ఐఏ ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తెచ్చింది.ఈ కేసులో ఈ నెల 7వ తేదీన కోర్టులో ఈడీ అధికారులు చార్జీషీట్ దాఖలు చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios