తల్లితో గొడవపడిన కుమార్తె కరాటే బెల్టుతో తల్లి గొంతు కోసి హతమార్చి ప్రమాదవశాత్తూ తల్లి మరణించిందని పోలీసులకు చెప్పింది

చదువుకోమని తరచూ చెబుతోందిని.. ఓ కూతురు.. ఏకంగా కన్న తల్లిని అతి దారుణంగా గొంతు కోసి చంపింది. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

నవీ ముంబైకు చెందిన 40 ఏళ్ల వయసు గల తల్లి తన 15 ఏళ్ల కుమార్తెను మెడికల్ కోర్సు చదవమని కోరింది. చదువు విషయమై తల్లీ కూతురు మధ్య తరచూ వాగ్వాదం జరిగేది. తల్లితో గొడవపడిన కుమార్తె కరాటే బెల్టుతో తల్లి గొంతు కోసి హతమార్చింది. అనంతరం తనకు ఏమీ తెలియనట్లు నాటకం ఆడింది. తాను తల్లిని చంపిన విషయాన్ని దాచిపెట్టింది. పోలీసుల వద్ద వేరే కథ అల్లింది.

 ప్రమాదవశాత్తూ తల్లి మరణించిందని పోలీసులకు చెప్పింది.మృతదేహాన్ని ఫోరెన్సిక్ పరీక్ష చేయించగా మహిళ గొంతు కోసి చంపినట్లు వెల్లడైంది. దీంతో బాలికను అరెస్టు చేసి ప్రశ్నించగా, తానే హత్య చేసినట్లు అంగీకరించింది. దీంతో బాలికపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశామని నవీ ముంబై పోలీసులు చెప్పారు.