Asianet News TeluguAsianet News Telugu

హై ప్రొఫైల్ మహిళలతో డేటింగ్.. 1.29 కోట్లు పోగొట్టుకున్న వ్యక్తి..

శారీరక వాంఛ, అత్యాశ ఓ వ్యక్తిని నిండా ముంచాయి. ఆ వ్యక్తి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి ఏకంగా 1.29 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన గుజరాత్ లోని రాజ్ కోట్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెడితే... రాజ్ కోట్ జిల్లా గోండల్ పట్టణానికి చెందిన అశ్విన్ విసారియాకు ఎర్త్ మూవింగ్ మిషిన్లతో పాటు చాలా పొలం కూడా ఉంది. 

dating fraud : man lost 1.29 crores in rajkot - bsb
Author
Hyderabad, First Published Jun 12, 2021, 4:57 PM IST

శారీరక వాంఛ, అత్యాశ ఓ వ్యక్తిని నిండా ముంచాయి. ఆ వ్యక్తి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి ఏకంగా 1.29 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన గుజరాత్ లోని రాజ్ కోట్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెడితే... రాజ్ కోట్ జిల్లా గోండల్ పట్టణానికి చెందిన అశ్విన్ విసారియాకు ఎర్త్ మూవింగ్ మిషిన్లతో పాటు చాలా పొలం కూడా ఉంది. 

నిరుడు ఫిబ్రవరిలో అతడి మొబైల్ కి ఓ మెసేజ్ వచ్చింది. ‘మీకు అందమైన హై ప్రొఫైల్ మహిళలతో డేటింగ్, శృంగారం కావాలంటే సంప్రదించండి..’ అని అందులో ఉంది. అది చదివిన అశ్విన్ ఆసక్తిగా ఉన్నట్లు రిప్లై ఇచ్చాడు. అవతలి నుంచి వాట్పాప్ కాల్ చేసిన ఓ నిందితుడు డేటింగ్ క్లబ్ లో మెంబర్ షిప్ ఫీజుగా రూ. 2,500 చెల్లించమంటే అశ్విన్ చెల్లించాడు. కొద్దిరోజులకు మరింత డబ్బు చెల్లించి అందులో వీఐపీ మెంబర్ అయ్యాడు. 

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి, ఇద్దరు పోలీసులు, ఇద్దరు పౌరులు మృతి......

అయితే, అతనికి ప్రతిఫలంగా ఏమీ దక్కలేదు. దీంతో తన డబ్బు తిరిగి చెల్లించకపోగా.. మరో కొత్త స్కీం గురించి చెప్పారు. తమ స్కీంలో డబ్బులు పెట్టబడిగా పెడితే ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పారు. మోసగాడి మాటలు నమ్మిన అతడు ఈ సారి భారీ మొత్తాలను పెట్టుబడి పెట్టి మోసపోయాడు.

మొత్తంగా 1.29 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. తాను మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పలువురిమీద మోసం, నేర కుట్ర కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios