సమయంలో సిలిండర్ ఒక్కసారిగా పేలింది. ఈ క్రమంలో.. వారి ఇంటితోపాటు.. పక్కనే ఉన్న మరో రెండు ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి.
ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలి దాదాపు 8మంది మృతి చెందారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఘటనలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మంగళవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోండా జిల్లాలోని టిక్రి గ్రామంలో చోటుచేసుకుంది.
ఆ గ్రామానికి చెందిన నురుల్ హాసన్ అనే వ్యక్తి కుటుంబం ఇంట్లో వంట చేస్తోంది. ఆ సమయంలో సిలిండర్ ఒక్కసారిగా పేలింది. ఈ క్రమంలో.. వారి ఇంటితోపాటు.. పక్కనే ఉన్న మరో రెండు ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో మొత్తం 8మంది ప్రాణాలు కోల్పోయారు.
వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, నలుగురు చిన్నారులు ఉన్నారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కూలిన ఇంటి శిథిలాల కింద చిక్కుకున్న దాదాపు 14 మందిని క్షేమంగా బయటకు తీసినట్లు పోలీసులు చెప్పారు.
