ప్రముఖ మోడల్, మిస్ ఇండియా 2011 ఫైనలిస్ట్ అరిషా జైన్ కి చెందిన సోషల్ మీడియా ఖాతాలను ఓ వ్యక్తి హ్యాక్ చేశాడు. అనంతరం వాటి పాస్ వర్డ్స్ మార్చి..డబ్బు ఇవ్వకుంటే ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి  నెట్టింట్ షేర్ చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ సంఘటన ముంబయి నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... అరిషా జైన్ కి ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, స్నాప్ చాట్ లలో ఖాతాలు ఉన్నాయి. కాగా.. అందులో ఆమె తనకు సంబంధించిన ఫోటోలను వాటిలో షేర్ చేస్తూ ఉంటారు. కాగా.. ఇటీవల ఆమె ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, స్నాప్ చాట్ లు హ్యాకింగ్ కి గురయ్యాయి. దుండగుడు..వాటి పాస్ వర్డ్స్ కూడా మార్చేశారు.

డబ్బులు ఇవ్వకుంటే ఫోటోలు మార్ఫింగ్ చేసి.. పోర్న్ వెబ్ సైట్లలో పెడతానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ మేరకు వాట్సాప్ లో మెసేజ్ లు కూడా చేయడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హ్యకర్ ఐడీ అడ్రస్ ని కనుక్కునే పనిలో పడ్డారు ముంబయి సైబర్ క్రైమ్ పోలీసులు. త్వరలోనే నిందితుడిని పట్టుకొని తీరతామని వారు చెప్పారు.