Asianet News TeluguAsianet News Telugu

ఇక బహిరంగ మార్కెట్లోకి కొవిషీల్డ్, కోవాగ్జిన్.. షరతులు వర్తిస్తాయి..

ఈ రెండు సంస్థల నుంచి అందిన సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించిన అనంతరం సీడీఎస్ సీఓకు చెందిన నిపుణుల కమిటీ బుధవారం సమావేశమై కొన్ని షరతులకు లోబడి రెండు టీకాలకు బహిరంగ విపణి అనుమతులను జారీ చేయవచ్చని నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. తుది ఆమోదం కోసం ఈ సిఫార్పులను డీసీజీఐకి పంపించనున్నారు. 

covishield covaxin recommended for regular market with certain conditions
Author
Hyderabad, First Published Jan 20, 2022, 7:50 AM IST

ఢిల్లీ : కొన్ని షరతులకు లోబడిcovishield, covaxin టీకాలను regular marketలోకి అనుతించేందుకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్ సీఓ)కు చెందిన నిపుణుల కమిటీ బుధవారం సిఫార్సు చేసింది. మన దేశంలో అభివృద్ధి పరిచిన ఈ రెండు covid vaccineలకు ఇప్పటివరకు అత్యవసర వినియోగ అనుమతి మాత్రమే ఉంది. తమ టీకాలను బహిరంగ మార్కెట్లో అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు అనుమతించాల్సిందిగా కొవిషీల్డ్ తయారీదారైన CII, కొవాగ్జిన్ ను అభివృద్ధి పరిచిన Bharat Biotech సంస్థలు విడివిడిగా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ( DCGI)కు దరఖాస్తు చేసుకున్నాయి. 

ఈ రెండు సంస్థల నుంచి అందిన సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించిన అనంతరం సీడీఎస్ సీఓకు చెందిన నిపుణుల కమిటీ బుధవారం సమావేశమై కొన్ని షరతులకు లోబడి రెండు టీకాలకు బహిరంగ విపణి అనుమతులను జారీ చేయవచ్చని నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. తుది ఆమోదం కోసం ఈ సిఫార్పులను డీసీజీఐకి పంపించనున్నారు. 

ఇదిలా ఉండగా, దేశంలో coronavirus విజృంభ‌ణ కొన‌సాగుతోంది. దీంతో రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. రోజువారీ కేసులు ఏకంగా మూడు ల‌క్ష‌ల మార్కును దాటిన‌ట్టు ఇప్ప‌టివ‌ర‌కు అందిన తాజాగా డేటా గ‌ణాంకాలు పేర్కొంటున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు అందిన క‌రోనా రోజువారీ స‌మాచారం ప్ర‌కారం.. జనవరి 19న దేశంలో 3,13,603 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి. ఇది వారం క్రితంతో పోలిస్తే 27% పెరిగింది. మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 3.8 కోట్ల‌కు పెరిగింది. active caseల సంఖ్య 18.9 లక్షల మార్కును దాటింది. అయితే, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్, లడఖ్, లక్షద్వీప్, త్రిపురలకు సంబంధించిన తాజా డేటా ఇంకా రావాల్సి ఉంది. ఈ డేటా అంచ‌నాలు క‌లుపుకుంటే రోజువారీ క‌రోనా కేసులు ఈ ఏడాదిలో కొత్త రికార్డులు నెల‌కోల్ప‌నున్నాయి.

జనవరి 19న మహారాష్ట్రలో 43,697 క‌రోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, క‌ర్నాట‌క‌లో 40,499, కేరళలో  34,199 కేసులు వెగులుచూశాయి. అలాగే, 475 మ‌ర‌ణాలు సైతం న‌మోద‌య్యాయి. గత వారంలో నమోదైన సగటు స్థాయిల కంటే ఇది చాలా ఎక్కువ. దీంతో కోవిడ్‌-19 మొత్తం మరణాల సంఖ్య 4,87,505కి చేరుకుంది. కొత్త మ‌ర‌ణాల్లో కేరళలో అధికంగా 134 మంది చ‌నిపోయారు. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (49), పశ్చిమ బెంగాల్ (38)లు ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో మొత్తం 18.6 లక్షల క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న క‌రోనా వేవ్ లో  ఒక్క రోజులో అత్యధిక ప‌రీక్ష‌లు ఇవే. కోవిడ్‌-19 పరీక్ష సానుకూలత రేటు (TPR) 16.4 శాతంగా ఉంది. 

జనవరి 19 నాటికి, అర్హులైన జనాభాలో 90.4 శాతం మంది కనీసం ఒక మోతాదుతో టీకాలు వేయబడ్డారు. అయితే 65.7 శాతం మందికి రెండు డోసుల టీకాలు అందించారు. 15-17 సంవత్సరాల వయస్సు జనాభాలో 51.8 శాతం మంది మొదటి డోసు టీకాలు అందించారు. మొత్తంగా దేశంలో 92,05,14,321 మొదటి డోసులు, 66,96,51,317 రెండవ డోసులు ప్ర‌జ‌ల‌కు అందించారు. అలాగే, 60,27,041 బూస్టర్ డోస్‌లు కూడా అందించబడ్డాయి.

Follow Us:
Download App:
  • android
  • ios